»   » గౌతమ్ చేతలు మీదుగా 'ఖలేజా' పాటల రిలీజ్

గౌతమ్ చేతలు మీదుగా 'ఖలేజా' పాటల రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా ఆడియోని ఈ రోజు పదకొండు గంటలకు విడుదల చేసారు. సంగత దర్శకుడు మణిశర్మ, మహేష్ బార్య నమ్రత, కుమారుడు గౌతమ్, దర్శకుడు త్రివిక్రమ్ సమక్షంలో రేడియో మిర్చి, బంజారా హిల్స్, హైదరాబాద్ లో ఈ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఇక మహష్ బాబు ముద్దుల కుమారుడు గౌతమ్ చేతుల మీదుగా ఈ ఆడియోను విడుదల చేసారు. ఇక యూనివర్శల్ కంపెనీ వారు ఈ పోగ్రాంని స్పాన్సర్ చేసారు. ఇక మహేష్...ఖలేజా టీ షర్ట్ లను మార్కెట్ లోకి విడుదల చేసారు.

ఇక ఈ చిత్రం ఆడియోని సోనీ మ్యూజిక్ వారు విపరీతమైన పోటీలో భారీ మొత్తానికి చేజిక్కిచ్చికున్నారు. ఇక సోనీ మ్యూజిక్ వారే ఇంతకు ముందు రజనీకాంత్..రోబో చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క..హీరోయిన్ గా చేస్తోంది. వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక ఖలేజా అక్టోబర్ ఏడున రిలీజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu