»   » ‘రోడ్డు నీ బాబుగాడి సొమ్మా...?’ నిలదీసిన మహేష్ బాబు

‘రోడ్డు నీ బాబుగాడి సొమ్మా...?’ నిలదీసిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పాట షూటింగ్ నిమిత్తం ఉన్న మహేష్ బాబు...'అన్నా ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా' అంటున్నారు. మహేష్, అనుష్క కాంబినేషన్ లో శ్రీ కనకరత్న మూవీస్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగనమల రమేష్‌ బాబు, సి.కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న మహేష్ 'ఖలేజా" చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ పరిచయ గీతాన్ని ఇందులో చిత్రీకరిస్తున్నారు. 'అన్నా ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా?" అనే పల్లవితో సాగే ఈ పాటను రామజోగయ్యశాస్ర్తీ రాయగా, ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ ‌గా నటిస్తున్నట్లు సమాచారం. చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే కొంత ప్యాచ్‌వర్క్ మినహా ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. ప్రధమార్ధానికి సంబంధించిన డబ్బింగ్, ఎడిటింగ్ పూర్తయింది. చెన్నయ్‌ లో ప్రస్తుతం మణిశర్మ రీరికార్డింగ్ సమకూరుస్తున్నారు. అర్చన ఈచిత్రంలో ఒక ప్రొఫెసర్ ‌కు అసిస్టెంట్‌ గా ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ నెలాఖరులో పాటలను, సెప్టెంబర్ చివర్లోగానీ, అక్టోబర్ మెదటి వారంలో గానీ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu