»   » మేము బానే ఉంటాం, ఫ్యాన్స్ మధ్యలో గొడవలు అర్థం కావటం లేదు: మహేష్ బాబు

మేము బానే ఉంటాం, ఫ్యాన్స్ మధ్యలో గొడవలు అర్థం కావటం లేదు: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు అగ్రనటులుగా ఉన్నప్పటికీ వారి అభిమానుల మధ్య ఏనాడు గొడవలు చోటు చేసుకోలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల ఫ్యాన్స్ గొడవ ఒకరి మరణానికి కారణమయ్యింది... అసలు వీరెద్దరికి వేరే ఏ గొడవాలేదు... కనీసం ఆ ఇద్దరు హీరోలమధ్య కూడా ఏమీ లేదు కానీ ప్రతీ హీరో అభిమానికి ఆటోమాటిక్ గా మరో హీరో, అతని అభిమానులూ శత్రువులైపోతున్నారు.

పిచ్చి అభిమానం

పిచ్చి అభిమానం

మరీ ఎమోషల్ గా ఉంటారూ.., పిచ్చి అభిమానం చూపిస్తారూ అనుకునే తమిళనాడులో కూడా పరిస్థితి ఇంత ధారుణం గా లేదు. ఒకప్పుడు రజినీ , అజిత్ ఫ్యాన్స్ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి, తర్వాత అజిత్, విజయ్ ల ఫ్యాన్స్ మధ్య కూడా ఇదే వాతావరణం ఉంది.

దారుణమైన హ్యాష్ ట్యాగ్స్

దారుణమైన హ్యాష్ ట్యాగ్స్

కానీ మరీ మనదగ్గర ఉన్నంత ట్రోలింగ్, దాడులు చేసుకునే శత్రుత్వం మాత్రం కనిపించదు... ఇక సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు మామూలుగా ఉండవు. మరీ దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పరస్పరం తిట్టిపోసుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అసలు ఆ భాషని చదవటానికి కూడా అసహ్యం వేసేలా ఉంటుంది.

మహేష్ అభిమానులు

మహేష్ అభిమానులు

ఈ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాపైన నేపథ్యంలో మహేష్ అభిమానులు.. పవన్ కళ్యాణ్ ను.. అతడి అభిమానుల్ని కించపరుస్తూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దానికి ప్రతీకారంగా ఈ మధ్య ‘ఇల్లిటరేట్ మహేష్' అనే ట్యాగ్ పెట్టి పవన్ ఫ్యాన్స్ పైశాచిక ఆనందం పొందారు.

 అల్లు అర్జున్ హాట్ టాపిక్

అల్లు అర్జున్ హాట్ టాపిక్

లేటెస్టుగా అల్లు అర్జున్ హాట్ టాపిక్ అయిపోయాడు. అతను పవన్ మీద చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ‘చెప్పను బద్రర్'.. ‘చూస్కుంటాం బ్రదర్'.. అనే హ్యాష్ ట్యాగులతో పవన్ ఫ్యాన్స్ అతడి మీద దారుణమైన కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరోవైపు అల్లు అర్జున్ మద్దతుదారులు.. పవన్-పవన్ ఫ్యాన్స్ మీద యుద్ధానికి దిగారు. ఇలా సోషల్ మీడియాను బేస్ చేసుకుని అవతలి హీరోలు-అభిమానుల మీద విషం కక్కే బ్యాడ్ కల్చర్ టాలీవుడ్లో రోజు రోజుకూ ముదిరిపోతోంది.

నేను చిరంజీవి సర్‌కి, చరణ్‌కి చాలా క్లోజ్‌

నేను చిరంజీవి సర్‌కి, చరణ్‌కి చాలా క్లోజ్‌

ఇదే నేపథ్యం లో ఒక ఇంటర్వ్యూ లో అసలూ ఈ గొడవలన్నీ ఏమిటో తనకు అర్థం కాదంటూ ''నేను చిరంజీవి సర్‌కి, చరణ్‌కి చాలా క్లోజ్‌. అయినప్పటికీ ఫాన్స్‌ మాత్రం బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ కోసం కొట్టుకుంటారు'' అని మహేష్‌ వ్యాఖ్యానించాడు. ఇక మెగా హీరోలకీ మహేష్ కీ లేని శత్రుత్వం మనకెందుకు అని అనుకుంటే ఎంతబవుంటుందీ...

 అలా జరుగుతూనే వుంటుంది

అలా జరుగుతూనే వుంటుంది

అక్కడ మహేష్‌, చరణ్‌ ఫ్యామిలీస్‌తో కలిసి విదేశాలకి టూర్లకి వెళ్లి ఎంజాయ్‌ చేసి వస్తోంటే, ఇక్కడేమో వారి అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ కాలం వెల్లదీస్తుంటారు. చరణ్‌ సినిమా వస్తే మహేష్‌ ఫాన్స్‌ ఫ్లాప్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేయడం, మహేష్‌ సినిమా ఫ్లాప్‌ అయిందంటే చరణ్‌ ఫాన్స్‌ సంబరాలు చేసుకోవడం అనేది అలా జరుగుతూనే వుంటుంది.

English summary
Tollywood star hero Mahesh Babu speaks about Friendship with Megastar chiranjeevi Family and Charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu