»   » అల్లు అర్జున్ ‘సంగీత్’ ఫంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ మహేష్ బాబు...!?

అల్లు అర్జున్ ‘సంగీత్’ ఫంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ మహేష్ బాబు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన సినిమా ఫంక్షన్లకి హాజరవడమే ఇష్టం లేక వీలయినంత వరకు ఆడియో ఫంక్షన్లు, వంద రోజుల వేడుకలని మహేష్ బాబు అవాయిడ్ చేస్తుంటాడు. ఇక సినిమా పరిశ్రమకి సంబంధించిన ఏ కార్యక్రమానికి మహేష్ అస్సలు అటెండ్ అవడు. పెళ్లిళ్లు, పేరంటాలు అయితే సరేసరి. అలాంటి మహేష్ బాబు తన అలవాట్లకి భిన్నంగా అల్లు అర్జున్ సంగీత్ ఉత్సవానికి సతీసమేతంగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పెళ్లిళ్లకే వెళ్లని మహేష్ సంగీత్ కి రావడం నిజంగా బన్నీకి అతనిచ్చిన గిప్టులాంటిదని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. మిగిలిన యు నటుల్లా డాన్సులు, హంగామా గట్రా చేయకపోయినా అల్లు అర్జున్, స్నేహారెడ్డిలని విష్ చేసి వారితో కాసేపు సమయం గడిపి మహేష్ వెళ్లిపోయాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే 'వరుడు" కంటే అక్కడున్నంత సేపు మహేష్ బాబు మెయిన్ ఎట్రాక్షన్ అయ్యాడు..

English summary
Surprise, surprise..Mahesh Babu, who usually isn’t a social person, doesn’t attend wedding ceremonies and other public/private parties. However, Mahesh Babu put his inhibitions aside and attended Allu Arjun’s Sangeet ceremony along with his better half Namratha. Most of the Tollywood celebrities attended Allu Arjun’s Sangeet but Mahesh Babu is undoubtedly the center of attraction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu