»   » ఇంటర్వ్యూ: రాజకీయాలపై, రాజమౌళి సినిమాపై మహేష్ బాబు

ఇంటర్వ్యూ: రాజకీయాలపై, రాజమౌళి సినిమాపై మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో 'శ్రీమంతుడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా ఆగస్టు 7న సినిమా విడుదల కాబోతోంది. సినిమాను భారీ హిట్ చేసి మహేష్ బాబుకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు. శ్రీమంతుడు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు 'ఇండియా టుడే'తో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

శ్రీమంతుడు సినిమా కథా బలంతో సాగుతుందని, తన పాత్ర కొత్తగా ఉంటుందని, బిజినెస్‌మేన్, దూకుడు చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ చాలా స్ట్రాంగ్‌గా ఉండే క్యారెక్టర్ అని మహేష్ బాబు తెలిపారు. 'దూకుడు' తరువాత నా సినిమాల్లో బెస్ట్ ఆడియో ఆల్బమ్ ఇదే అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పై పొగడర్తల వర్షం కురిపించారు మహేష్ బాబు.


నేను ఎంచుకున్న ఏ సినిమాలో అయినా అందులోని పాత్ర నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించాలి. ఆ తరువాత నేను నా బెస్ట్ ఇస్తాను. ఫలితం దైవ నిర్ణయానికే వదిలేస్తాను అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. రాజమౌళి తో సినిమా గురించి, రాజకీయాల గురించి మహేష్ బాబు చెప్పిన విషయాలు స్లైడ్ షోలో...


అదృష్టమో? దురదృష్టమో?

అదృష్టమో? దురదృష్టమో?

మా నాన్న గారి నుంచి అభిమానులూ నాకు వచ్చారు. అది నాకు దక్కిన వరం. అందుకే, అదృష్టమో, దురదృష్టమో కానీ నా ప్రతి సినిమా మీద అంచనాలు ఎప్పుడూ భారీగా ఉంటాయి. ఇప్పుడు ఈ 'శ్రీమంతుడు' మీద కూడా ఉన్నాయి. ప్రతిసారీ వాళ్ళకు నచ్చేలా ఏదో ఒకటి చేయడానికి శ్రమిస్తూ ఉంటాను అన్నారు మహేష్ బాబు.


నాన్న ప్రభావం...

నాన్న ప్రభావం...

మా నాన్న గారే నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ పెరిగా. అందుకే, నా మీద ఆయన ప్రభావమే ఉంది. నాకు స్ఫూర్తి కూడా ఆయనే. నాన్న గారి నుంచి నేనెంతో నేర్చుకున్నా. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఆయన వల్లే అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


ఎవరి జోక్యం ఉండదు

ఎవరి జోక్యం ఉండదు

సినిమాల ఎంపిక విషయంలో నిర్ణయం పూర్తిగా నాదే. మా నాన్న గారి ప్రమేయం, నా వైఫ్ నమ్రత జోక్యం ఉండవు. నా నిర్ణయాలన్నీ స్క్రిప్ట్‌ను బట్టే ఉంటాయి. కొన్నిసార్లు అప్పటికప్పుడు ఓ.కె. చెప్పేస్తా. కొన్నిసార్లు కొద్దిగా టైమ్ తీసుకొని నిర్ణయం చెబుతాను అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


చొక్కా విప్పేస్తా..కానీ

చొక్కా విప్పేస్తా..కానీ

స్క్రిప్ట్‌ను బట్టి దర్శకుడు నా నుంచి ఏది కోరుకుంటే అది చేస్తా, నా పాత్రకూ, స్క్రిప్ట్‌కూ అవసరమని కన్విన్స్ అయితే, బాలీవుడ్‌లో లాగా చొక్కా విప్పేసి, నటిస్తా అన్నారు.


స్టైల్ విషయంలో...

స్టైల్ విషయంలో...

గతంలో అయితే, స్టైల్ విషయంలో ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. కానీ, ఇప్పుడు మాత్రం సింపుల్‌గా ఉండడమే ఇష్టపడుతున్నా. ఇక, అందం, ఆరోగ్యం విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటానని మహేష్ బాబు తెలిపారు.


మల్టీస్టారర్స్...

మల్టీస్టారర్స్...

వెంకటేశ్ గారితో కలసి నేను నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మంచి హిట్. ఆ సినిమా షూటింగ్ టైమ్ బ్రహ్మాండంగా గడిచింది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. సెట్స్ మీదే కాదు... బయట కూడా వెంకటేశ్ గారితో నాకు బ్రహ్మాండమైన స్నేహం ఉంది. అలాంటి మల్టీస్టారర్లు తెలుగులో మరిన్ని రావాలన్నారు మహేష్ బాబు.


రాజమౌళితో సినిమా గురించి..

రాజమౌళితో సినిమా గురించి..

'బాహుబలి' రెండో పార్ట్ అయిపోయిన తరువాత నేను, దర్శకుడు రాజమౌళి కలసి ఒక సినిమా చేయనున్నాం. స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాలేదు అన్నారు మహేష్ బాబు.


రాజకీయాల గురించి..

రాజకీయాల గురించి..

మా నాన్న గారు గతంలో రాజకీయాల్లో కృషి చేశారు. మా బావ జయదేవ్ గల్లా ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. నేను మాత్రం రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదు. అవి నాకు తెలియవు, అర్థం కావు అన్నారు మహేష్ బాబు.
English summary
Mahesh Babu Interview about Srimanthudu movie.
Please Wait while comments are loading...