»   » మహేష్ బాబు ప్యాన్స్ కు హ్యాపీ న్యూస్

మహేష్ బాబు ప్యాన్స్ కు హ్యాపీ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు రెండున్నర ఏళ్ళగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు సినిమా ఓ కొలిక్కి వచ్చింది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం వేసవిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు, కామిడీ సన్నివేశాలు బాగా పండుతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మాత శింగనమల రమేష్ పేర్కొంటున్నారు. ఇంతకు ముందు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం మాదిరిగానే ఈ చిత్రంకూడా ఫ్యామిలీలను, యువతను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేంద్రరెడ్డితో చేసిన అతిధి తర్వాత మహేష్ ది ఏ చిత్రమూ రిలీజ్ కాలేదు. ఇక త్రివిక్రమ్ పవన్ తో చేసిన జల్సా తర్వాత వస్తున్న చిత్రం ఇదే. అలాగే త్రివిక్రమ్ తాజాగా విజయ్ భాస్కర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రానున్న చిత్రానికి కథ, మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu