twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్ డే స్పెషల్: మహేష్ బాబు ఎంత ఎదిగిపోయాడో... (రేర్ ఫోటోస్)

    నేడు తెలుగు స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ రోజుతో ఆయన 42వ వడిలో అడుగు పెడుతున్నారు.

    By Bojja Kumar
    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈ రోజు పండగరోజు. కృష్ణ సినీ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాల నటుడి స్థాయి నుండి టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగిన మహేష్ నేడు 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

    మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా ఇతర స్టార్లతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, ఇల్లు తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అంతే కాదు... ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులు కూడా తక్కువే. కుటుంబానికి, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మనిషి,

    మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. చిన్నతనంలో చదువు కొనసాగిస్తూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు.

    మహేష్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. 'వంశీ' సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ ప్రేమలో పడిన మహేష్.... పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

    బాలనటుడిగా

    బాలనటుడిగా

    మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు. 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కోరిక మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని చెప్పరాట. ఆయన అన్నట్లే మహేష్ బాబు ఇపుడు పెద్ద స్టార్ అయ్యారు.

    Recommended Video

    Prince Mahesh Babu Birthday Special, Turns 42
    తండ్రి, అన్నయ్య సినిమాల్లో

    తండ్రి, అన్నయ్య సినిమాల్లో

    1987‌లో మహేష్ బాబు తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి బాలనటుడిగా ద్విపాత్రభినయం చేశాడు. 1990 లో విడుదలైన బాలచంద్రుడు మరియు అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు.

    హీరోగా ఎంట్రీ

    హీరోగా ఎంట్రీ

    బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత చదువు కోసం గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు డిగ్రీ పూర్తి చేసి....‘రాజకుమారుడు' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కోరీర్లో తొలి భారీ హిట్.

    తొలి అవార్డు

    తొలి అవార్డు

    గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ‘ఒక్కడు' మహేష్ బాబు స్టార్ ఇమేజ్ మరింత పెంచింది. మహేష్ బాబు నటించిన ‘నిజం' చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

    గుర్తుండిపోయే పాత్ర

    గుర్తుండిపోయే పాత్ర

    మహేష్ కెరీర్లో ప్రేక్షకులకు బాగానచ్చిన చిత్రం 2005లో విడుదలైన ‘అతడు'. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి నంది అవార్డు అందుకున్నారు.

    సౌతిండియా రికార్డ్

    సౌతిండియా రికార్డ్

    2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

    ఐదేళ్ల పాటు గడ్డుకాలం, వరుస ప్లాపులు

    ఐదేళ్ల పాటు గడ్డుకాలం, వరుస ప్లాపులు

    పోకిరీ తరువాత వచ్చిన నిర్మాణమయిన ‘సైనికుడు'(2006), ఆ తరువాత వచ్చిన ‘అతిథి'(2007) బాక్సాఫీసు వద్ద పరాజయంపాలయ్యాయి. 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ‘ఖలేజా'(2010)కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

    దూకుడు పెంచిన మహేష్

    దూకుడు పెంచిన మహేష్

    2011లో వచ్చిన 'దూకుడు' చిత్రంతో మహేష్ బాబు మళ్లీ ఫాంలోకి వచ్చారు. మహేష్ కెరీర్లోనే ఇది అతిపెద్ద హిట్. 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. తర్వాత వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా చేయగా అది కూడా పెద్ద హిట్.

    వన్ ఒక డిఫరంట్ మూవీ

    వన్ ఒక డిఫరంట్ మూవీ

    సుకుమార్ దర్శకత్వంలో 'వన్-నేనొక్క్డినే' అనే ఒక డిఫరెంట్ చిత్రంలో మహేష్ నటించాడు. అది ఒక అద్భుతమైన సినిమాగా సినీ విమర్శకుల నీరాజనాలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తర్వాత వచ్చిన ఆగడు కూడా పెద్ద ప్లాప్.

    మళ్లీ శ్రీమంతుడయ్యాడు

    మళ్లీ శ్రీమంతుడయ్యాడు

    కొరటాల శివ చిత్రం‘శ్రీమంతుడు'కు మహేష్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈచిత్రం ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించి మహేష్ బాబును కీర్తి పరంగా శ్రీమంతుడిని చేసింది. తరువాత ఎన్నో అంచనాల మద్య విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఆకట్టుకోలేకపోయింది.

    మహేష్ బాబు తాజా సినిమాలు

    మహేష్ బాబు తాజా సినిమాలు

    మహేష్ బాబు ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్', కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    Today, Mahesh Babu turns forty two. Born in 1975 in Chennai, Mahesh enthralled his father Superstar Krishna’s fans with several memorable roles as a child artiste. He then made his debut as a hero with the 1999 release Rajakumarudu. Soon, Mahesh evolved into a Superstar and cultivated his own fan base, which admired his acting in numerous films over the past 17 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X