»   » తన తండ్రి కృష్ణ గారి గురించి మహేష్ ట్వీట్

తన తండ్రి కృష్ణ గారి గురించి మహేష్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన తండ్రి సినిమాల్లో 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. "తెలుగు సినిమా గర్వించే వ్యక్తుల్లో నాన్న గారికి ఎప్పుడూ స్థానం ఉంటుంది. సినిమాల్లో 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నామటుకు ఎప్పటికే నాన్నే ఆదర్శం!" అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కృష్ణ గారు తన కొడుకు గురించి ఇలా అన్నారు... పరిశ్రమలో మహేష్‌ నా స్థానాన్ని నిలబెట్టాడు. కథల విషయంలో నాలాగే ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడున్నవాళ్లల్లో నా అభిమాన హీరో తనే. ఆ తర్వాత ప్రభాస్‌ కూడా నచ్చుతాడు. బాగుంటాడు. మహేష్‌ని జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో చూడాలనే కోరిక ఉంది. అలాంటి కథ తనకి ఎప్పటికి దొరుకుతుందో మరి. మంచి కథ దొరికితే నేను, మహేష్‌, నా మనవడు గౌతమ్‌కృష్ణ కలిసి నటిస్తాం అని చెప్పారు.

తెలుగు సినిమాకి సరికొత్త గ్లామర్‌ను తీసుకొచ్చిన హీరో కృష్ణ. నిండు చందురుడు ఒకవైపు... చుక్కలు ఒకవైపు అన్నట్టు - పరిశ్రమలో తోటి కథానాయకులంతా ఒక తరహా సినిమాలు తీస్తే కృష్ణ మరో రకమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. కథల ఎంపికలోనూ... సినిమా నిర్మాణంలోనూ సాహసాలు చేస్తూ విజయాలు అందుకొన్నారు. ఇతర హీరోలంతా సాంఘిక చిత్రాలవైపు దృష్టి పెడితే... కృష్ణ మాత్రం బాండ్‌ తరహా చిత్రాలతో తెలుగు జేమ్స్‌ బాండ్‌ అనిపించుకొన్నారు.

Mahesh babu tweet about his father

అలాగని అదే ఇమేజ్‌కి పరిమితం కాలేదు. కుటుంబ కథలతోనూ మెప్పించారు. పౌరాణికాలు, జానపద చిత్రాలతోనూ తనకి తిరుగులేదని నిరూపించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన 'తేనె మనసులు'తో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. ఆ చిత్రం 1965 మార్చి 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే కృష్ణ సినీ ప్రయాణం యాభయ్యేళ్లు పూర్తి చేసుకొంటుందన్నమాట.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్, త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించే బ్రహ్మోత్సవం షూటింగ్‌లో పాల్గొంటారు.

English summary
Mahesh Babu tweeted: "My father is and will always remain 1 of the greatest personalities in the Telugu film industry ..Congratulations on completing 50 fabulous years .. Extremely proud :)He is and will always be my inspiration:)
Please Wait while comments are loading...