»   » అత్యంత సంతోషకరమైన రోజు అంటూ మహేష్ బాబు ట్వీట్...

అత్యంత సంతోషకరమైన రోజు అంటూ మహేష్ బాబు ట్వీట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు' చిత్రం బాక్సాపీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడం, రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఉదయం బెనిఫిట్ షోలు ముగిసిన అనంతరం అభిమానులు, సినీ ప్రేమికుల నుండి రెస్పాన్స్ అదిరి పోవడంతో ఆయన ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తంచేసారు.

"నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుల్లో ఇదొకటి. శ్రీమంతుడు చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆనందంగా ఉంది... లవ్ యూ ఆల్" అంటూ ట్వీట్ చేసాడు.మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.


English summary
Mahesh Babu tweet about Srimanthudu result
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu