»   »  నా బలం.. నా జీవితపు వెలుగు నువ్వే !: మహేష్ బాబు

నా బలం.. నా జీవితపు వెలుగు నువ్వే !: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లైఫ్ పార్టనర్ .. నమ్రత తన బలమని సూపర్‌స్టార్‌ మహేష్ బాబు అన్నారు. ఆదివారం మహేష్ సతీమణి, నటి నమ్రత పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రతపై ఉన్న ప్రేమను తెలుపుతూ ట్విట్టర్‌ ద్వారా మహేష్‌ ఆమెకుజన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రేమను తెలియజేసేందుకు ట్విట్టర్ ఖాతాను ఎంచుకున్నాడు. నమ్రత ఫోటోను ట్వీట్ చేస్తూ ఈ క్రింద విధంగా విషెష్ తెలిపారు.

"నా బలం, నా జీవితంలో వెలుగు నువ్వే. హ్యాపీ బర్త్ డే టూ మై డియరెస్ట్ వైఫ్" అని ట్వీట్ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతల జంట ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఉదయం 9 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Mahesh babu tweet wishes to his wife

మహేశ్‌ ప్రస్తుతం ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీ టైటిల్ ఖరారైందంటూ గతంలో వాస్కోడిగామా, ఎనీమీ, అభిమ‌న్యుడు, ఏజెంట్ శివ, ఏజెంట్ 007...ఇలా రకరకాల టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఏజెంట్ శివ టైటిల్ దాదాపు క‌న్ ఫ‌ర్మ్ అయిందని.. ఈ టైటిలే త్వ‌ర‌లో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. మ‌హేష్ బాబు - మురుగుదాస్ ల మూవీ కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో సంభ‌వామి అనే టైటిల్ రిజిస్టర్ చేసిన‌ట్టు వార్తలు వచ్చినా పక్కగా ఎవరూ ఇదే టైటిల్ అంటూ ఇంకా చెప్పకపోవటం అభిమానుల్లో కొంత గందరగోళానికి కారణమయ్యింది.

English summary
Mahesh Babu tweeted: "My strength and the light of my life - Happy Birthday to my dearest wife :)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu