»   » నన్ను నడిపించే శక్తి, నా కొడుకు: మహేష్ బాబు

నన్ను నడిపించే శక్తి, నా కొడుకు: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు ఇవాళ . ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కూడా తన వారసుడికి ఓ హార్ట్ టచింగ్ ట్వీట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'నా ఉనికికి కారణం అతనే, నన్ను నడిపించే శక్తి, నా కొడుకు, నా జీవితం, నా సంతోషం. హ్యాపి బర్త్ డే గౌతమ్' అంటూ ట్వీట్ చేశాడు. మామూలుగానే తన పిల్లలమీద చాలా భాధ్యతగా ఉంటాడు మహేష్. ఇలాంటి సందర్భాలలో మరీ ప్రేమగా ఉంటాడు.

అయితే ఒక్క తండ్రివంతేనా... నేను మాత్రం తక్కువా అన్నట్టు నమ్రతాకూడా ఇన్స్టాగ్రాం లో గౌతమ్ కి శుభాకాక్షలు చెప్పింది. పుట్టిన రోజు సుభాకాంక్షలు, నువ్వు సూర్యుడుకన్నా ఎక్కువ మెరవాలి, పరిపూర్ణమైన జీవితాన్ని పొందాలి, ఎదిగే ప్రతీ ఏడూ మరింత ప్రేమించటం నేర్చుకో, నువ్వెప్పుడూ ఊహించలేనంత ప్రేమిస్తున్నా నిన్ను" అనే అర్థం వచ్చేలా ఇన్స్టాగ్రాం లో పోస్ట్ చేసింది నమ్రత.

ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ కోసం రొమానియాలో ఉన్న మహేష్, ఈ షెడ్యూల్ తో స్పైడర్ షూటింగ్ పూర్తి చేయనున్నాడు. హైదరాబాద్ తిరిగొచ్చాక ఇప్పటికే ప్రారంభమైన కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న స్పైడర్ సెప్టెంబర్ 27న భారీగా రిలీజ్ కానుంది.

English summary
"He is the reason for my existence.. my driving force.. my son.. my world.. my happiness.. Happy Birthday, Gautam Stay blessed!" Tweets Mahesh Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu