»   » అజ్మీర్‌దర్గాను దర్శించుకున్న మహేష్ బాబు

అజ్మీర్‌దర్గాను దర్శించుకున్న మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బుధవారం అజ్మీర్ దర్గాను దర్శించుకున్నారు. తన సినిమాల విడుదల ముందు దర్గాను దర్శించుకోవడం మహేష్ బాబు గత కొంత కాలంగా కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన 'దూకుడు' సినిమా సక్సెస్ తర్వాత, 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల ముందు ఈ దర్గాను దర్శించారు.

ఆయన అదే సెంటిమెంటును ఫాలో అవుతూ....'1-నేనొక్కడినే' సినిమా విడుదలను పురస్కరించుకుని అజ్మీర్ దర్గాను దర్శించుకున్నట్లు పిఆర్ఓ బిఎ రాజు వెల్లడించారు. సినిమా విజయం సాధించాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు తెలిపారు. సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేసిన మహేష్ బాబు సెంటిమెంటును కూడా ఫాలో అవుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Mahesh Babu visits Ajmer Dargah

కాగా....'1-నేనొక్కడినే' సినిమా టీజర్‌కు మంచి స్పందన రావడం, ఆడియో విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు. ఈ సినిమా తన కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని ఆయన నమ్మకంతో ఉన్నారు.

అదే విధంగా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామెన్ రత్నవేలు పనితీరును మెచ్చుకుంటూ ట్విట్టర్లో వారిపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. ఈ సంక్రాంతి '1' సినిమా అందరికీ మంచి వినోదాన్ని పంచుతుందని మహేష్ బాబు తెలిపారు.

'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Superstar Mahesh Babu just left to Ajmer Dargah to pray for the success of his upcoming movie ’1-Nenokkadine’. 
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu