twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళంలో సినిమా చేస్తున్నా, డైరక్టర్ ఎవరంటే...: మహేష్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు చాలా కాలం నుంచి తమిళ దర్శకులతో చేస్తారని వార్తలు వస్తున్నాయి. మణిరత్నం చేస్తారు అని కొంత కాలం లింగు స్వామితో చేస్తారని కొంతకాలం ఇలా టాక్స్ నడిచాయి..కానీ ఏదీ ఖరారు కాలేదు. అయితే మురుగదాస్ తో ఆయన ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు మహేష్ బాబు తాజాగా ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలియచేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మహేష్ బాబు మాట్లాడుతూ..." నేను తమిళ,తెలుగు భాషల్లో బైలింగ్వుల్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాను. మురగదాస్ చేసే అవకాసం ఉంది ." అని తేల్చి చెప్పారు. అలాగే ఈ మధ్యకాలంలో మహేష్, మురగదాస్ ఈ చిత్రం విషయమై చాలా సార్లు కలిసారని, ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని మహేష్ చెప్పారు. అంటే త్వరలోనే మహేష్..తమిళ సినిమా ఉండబోతోందన్నమాట.

    Mahesh babu want to work with Muugadoss

    ఇక ఆయన తాజా చిత్రం విషయానికి వస్తే...

    కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు.

    చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.

    కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.

    దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.

    నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.

    శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

    English summary
    Mahesh Babu is keen to do a Tamil movie since he grew up in Chennai and is fluent in the language. “I would ideally like to do a bilingual which will be made in Tamil and Telugu. Very keen to work with A.R. Murugadoss.” Mahesh and Murugadoss have met a couple of times and the actor reveals that a script is being worked on by the famous director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X