»   » సచిన్ కోసం మహేష్ బాబు కూడా..!

సచిన్ కోసం మహేష్ బాబు కూడా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సొంతం. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో సచిన్‌ను క్రికెట్ దేవుడిలా పూజిస్తారంటే అతిశయోక్తి కాదు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన అభిమానులే.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇటీవల సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించగానే ఆయ అభిమానులంతా ఒక్కసారి షాకయ్యారు. ఇక మళ్లీ ఆయన ఆటను స్వయంగా చూసే అవకాశం లేక పోవడంతో...సచిన్ ఆడబోతున్న చివరి టెస్టు మ్యాచ్ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

సచిన్ అభిమానుల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ నెల 14 నుంచి 18 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ ఆడే చివరి టెస్ట్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా సినిమా '1-నేనొక్కడినే' షూటింగులో భాగంగా గోవాలో ఉన్నారు. అటు నుండి నేరుగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుతో పాటు మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సచిన్ ఆడే చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు వెలుతున్నారు. సచిన్ ఆడే మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీగా ఎగబడుతుండటంతో ఆన్ లైన్లో టికెట్లు విక్రయించే వెబ్ సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది.

English summary

 As like most of Indians, Mahesh Babu is also a great fan of Sachin Tendulkar and he is going to attend Sachin's final Test Match along with his family members on day one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu