»   » శ్రీవారి మొక్కు: గుండు చేయించుకున్న మహేష్ బాబు భార్య (ఫోటోస్)

శ్రీవారి మొక్కు: గుండు చేయించుకున్న మహేష్ బాబు భార్య (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమత్ర తిరుమల శ్రీవారికి బుధవారం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తలనీలాలను అర్పించుకుని గుండు చేయించుకున్నారు.

నమ్రతతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారతో పాటు.... కొందరు కుటుంబ సభ్యులు, సినీ దర్శకుడు మెహర్ రమేష్ ఉన్నారు. ఆలయ అధికారులు నమ్రత ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి నమ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలనను అందజేశారు.

మహేష్ బాబు భార్య, పిల్లలను చూడగానే పలువురు అభిమానులు వారిని చూసేందు, మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన ఫోటోస్ క్రింద చూడొచ్చు.

ఫ్యాన్స్ హడావుడి

ఫ్యాన్స్ హడావుడి

కొండపై నమ్రతను చూసి మహేష్ బాబు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే శ్రీవారికి తలనీలాలు గుండుతో ఉండటంతో చున్నీతో తలను కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మెహర్ రమేష్ ఎందుకొచ్చాడు?

మెహర్ రమేష్ ఎందుకొచ్చాడు?

నమ్రతతో పాటు మెహర్ రమేష్ కూడా స్వామి వారిని దర్శించుకున్నాడు. అందుకు కారణం త్వరలో మహేష్ బాబుతో నేషనల్ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ ఫిల్మ్ తీయబోతున్నాడట. అందుకే నమ్రతకు సహాయంగా ఉంటుందని వచ్చినట్లు తెలుస్తోంది.

బీజిగా ఉండట వల్లే మహేష్ రాలేదు

బీజిగా ఉండట వల్లే మహేష్ రాలేదు

ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో చెన్నై లో జరుగుతున్న షూటింగులో బిజీగా ఉన్నాడు. అందుకే మహేష్ బాబు నమ్రతతో పాటు తిరుమలకు రాలేక పోయారని వారి సన్నిహితులు అంటున్నారు.

నమ్రత అన్నీ తానై...

నమ్రత అన్నీ తానై...

నమ్రత అన్నీ తానై మహేష్ బాబు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, పిల్లల విషయాలు చూసుకుంటున్నారు. బర్డెన్ అంతా నమ్రత తీసుకుంటుంది కాబట్టే తాను ఎలాంటి ఇబ్బంది పడకుండా సినిమా షూటింగులకు హాజరవుతున్నానని మహేష్ బాబు గతంలో తెలిపారు.

ప్రొడక్షన్ బాధ్యతలు కూడా

ప్రొడక్షన్ బాధ్యతలు కూడా

శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు తన సొంత బేనర్ ‘మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్' సంస్థను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ బాధ్యతల్లో కూడా మహేష్ బాబుకు చేదోడు వాదోడుగా ఉంటోంది నమ్రత.

English summary
Maheshbabu’s Family Namratha Shirodhkar, Gautam and Sitara Visits Tirumala and Offered theri Prayers to Lord Venkateshwara. Namratha Shirodhkar shred her hair offered her prayers to Lord Venkateshwara.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu