»   » కమల్ హాసన్ తో నటించనున్న ప్రిన్స్ మహేష్ బాబు?

కమల్ హాసన్ తో నటించనున్న ప్రిన్స్ మహేష్ బాబు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో నటించే అవకాశం ప్రిన్స్ మహేష్ బాబుకు వస్తోందట. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఓ సినిమాలో విక్రమ్ తో కలిసి మహేష్ బాబు నటిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. చోళులు, పల్లవ రాజుల ఇతివృత్తంతో ఈ సినిమా నిర్మాణవుతోంది. దీనికి మణిరత్నం దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, తెలుగులో మహేష్ బాబు పక్కన విక్రంతో పాటు సూర్య నటిస్తాడని ఇప్పడు ప్రచారం జరుగుతోంది. విక్రం, మహేష్ బాబు ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తారని, సూర్య ఓ ప్రముఖ రాజు పాత్ర పోషిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ఓ ముఖ్య పాత్రను చేస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu