»   » ఎంత ముద్దు వస్తోందో : మహేష్ బాబు కుమార్తె సితార డ్యాన్స్‌ ( వీడియో)

ఎంత ముద్దు వస్తోందో : మహేష్ బాబు కుమార్తె సితార డ్యాన్స్‌ ( వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ముద్దులు కూతురు సితార కు మొదటి నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార చిన్నప్పటి నుంచీ లిటిల్ స్టార్. ముద్దులొలికే ఆమె ఫోటోలు అంటే మహేష్ ఫ్యాన్స్ కు భలే ఇష్టం. అలాంటిది ఆమె డాన్స్ చేసిన వీడియో గురించి చెప్పాలా...

Also Read: మహేష్‌ను పోలిన మరో నటుడు, చెర్రీలా కూడా... (ఫోటోస్)

సితార ఇటీవల జరిగిన స్కూల్ డాన్స్ పోగ్రామ్ లో డాన్స్ చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో 'క్లాప్‌ క్లాప్‌' అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియోని సితార తల్లి నమ్రత ఇనిస్ట్రిగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానలకు అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Sitara annual day dance performance 👍👍👍👍👏👏👏👏👏

A video posted by Namrata Shirodkar (@namratashirodkar) on Mar 20, 2016 at 2:22am PDT

మరో ప్రక్క 'బ్రహ్మోత్సవం' చిత్రంతోత్వరలో మహేశ్‌బాబు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్. ఈ చిత్రంలో సితార ఓ చిన్న పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అటు మహేష్ గానీ, నమ్రత గానీ అఫీషియల్ గా ఖరారు చేసి చెప్పలేదు.

కానీ ఇప్పటికే సితారపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పుకుంటున్నారు. మహేష్ , సితార కాంబినేషన్ లో ఆ సీన్ ఉంటుందని చెప్తున్నారు. ఈ సీన్ సినిమాలో హైలెట్ గా ఉంటుందని వినికిడి. అయితే ఇది రూమరా, నిజమా అనేది తేలాల్సి ఉంది.

మరిన్ని విశేషాలు..సితార ఫొటోలతో కలిపి...

ఇప్పటికే..

ఇప్పటికే..

మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ '1' నేనొక్కడినే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఖచ్చితంగా

ఖచ్చితంగా

'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రంలో మహేశ్‌బాబు కుమార్తె సితార తెరంగేట్రం చేస్తుందన్న వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయం ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఇదే నిజమైతే మహేశ్‌ అభిమానులు కచ్చితంగా ఆనందిస్తారని చెప్పవచ్చు.

చాలా కాలం

చాలా కాలం

సితార ..ఎంట్రీ విషయమై చాలా సార్లు మహేష్ తో చర్చించాల్సి వచ్చిందని, ఆయన తొలుత ఒప్పుకోలేదని వార్త.

డిస్ట్రబ్ అవుతుందని

డిస్ట్రబ్ అవుతుందని

చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్న సితార...మధ్యలో షూటింగ్, షెడ్యూల్ , హడావిడి అంటే డిస్ట్రబ్ అవుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

సితార తల్లిసైతం

సితార తల్లిసైతం

గతంలో సితార తల్లి నమ్రత శిరోద్కర్ కూడా హీరోయిన్ గా తెలుగులో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

తాతకు కూడా

తాతకు కూడా

తన మనుమరాలిని తెరపైచూడాలని తాతగారు కృష్ణ కూడా మహేష్ తో అన్నట్లు చెప్పుకుంటున్నారు.

మెమరీస్ కోసం

మెమరీస్ కోసం

పెద్దయ్యాక చూసుకునేందుకు సితారకు ఇప్పుడు సినిమా చేస్తే ఓ మెమరీగా ఉంటుందని బావిస్తున్నారు.

ఇరగతీస్తుంది

ఇరగతీస్తుంది

సితార స్టెప్స్ , డాన్స్ లు ఇరగతీస్తుందని మహేష్ గతంలో మీడియాతో చెప్పారు

మహేష్ డైలాగులు

మహేష్ డైలాగులు

తన తండ్రి మహేష్ డైలాగులు సైతం ఆమెకు చాలా భాగం బట్టీనేట. ఆమె అప్పుడప్పుడూ సరదాగా చెప్పి తన తండ్రిని ఆనందపరుస్తుందిట.

చిన్న పిల్ల కాబట్టి

చిన్న పిల్ల కాబట్టి

కాకపోతే నమ్రత మాత్రం కొద్ది కాలం ఆగిన తర్వాతే కెమెరా ముందుకు సితారని తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

ఓ నిండుతనం

ఓ నిండుతనం

బ్రహ్మోత్సవంలో సితార నటిస్తే ఖచ్చితంగా ఓ నిండుతనం వస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాంబినేషన్

కాంబినేషన్

సితార కానీ నటిస్తే ..ఖచ్చితంగా తండ్రి కూతుళ్ల కాంబినేషన్ ఉండాల్సిందే.

అన్న ప్రోత్సాహం

అన్న ప్రోత్సాహం

సితారకు డాన్స్ నేర్పటంలో అన్న గౌతమ్ ప్రోత్సాహం చాలా ఉందిట.

ముద్దుల కూతురు

ముద్దుల కూతురు

మహేష్ ఇంటికి రాగానే మొదట పలకరించేది, వెతుక్కునేది సితార గురించేట.

ఆటలే ..ఆటలు

ఆటలే ..ఆటలు

ఆ మధ్యన నమ్రత మాట్లాడుతూ...మహేష్ ..ఎప్పుడూ సితార ని వదిలి ఉండడని, ఇంటిలో ఉన్నంతసేపూ సితారతోనే ఎక్కువ సేపు గడుపుతారని అన్నారు.

English summary
Mahesh daughter Sithara dance programme at her school viral in Social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu