»   » ఇదిగో సాక్ష్యం :‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు కుమార్తె సితార ( ఫొటో)

ఇదిగో సాక్ష్యం :‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు కుమార్తె సితార ( ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబు కుమార్తె సితార.. ఆయన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ రూమర్స్ కొట్టి పారేస్తున్నారు కొందరు.

కానీ రీసెంట్ గా సితార.. 'బ్రహ్మోత్సవం'షూటింగ్ దగ్గర ఉన్న వ్యానిటీ వ్యాన్ లో కనపించిది. వ్యాన్ ఎక్కి తన తండ్రి క్యాప్ పెట్టుకుని మరీ ఫొజు ఇచ్చింది. ఈ ఫొటోని సితార తల్లి నమ్రత శిరోద్కర్ ఇనిస్ట్ర్రగ్రామ్ లో షేర్ చేసింది.

Wearing her fathers cap😘😘😘in more ways than one 😂😂😂

A photo posted by Namrata Shirodkar (@namratashirodkar) on Mar 20, 2016 at 11:59pm PDT

ఈ ఫొటో చూసిన వారు ఇప్పుడు సితార ఖచ్చితంగా 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. అందుకే అక్కడ లొకేషన్ లో కనిపించింది అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదు తన తండ్రితో స్పెండ్ చేయటానికి వచ్చిందని మరి కొందరు అంటున్నారు. ఏది నిజమో తేలాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరో ప్రక్క 'బ్రహ్మోత్సవం' చిత్రంతోత్వరలో మహేశ్‌బాబు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్. ఈ చిత్రంలో సితార ఓ చిన్న పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అటు మహేష్ గానీ, నమ్రత గానీ అఫీషియల్ గా ఖరారు చేసి చెప్పలేదు.

Mahesh daughter Sithara surprises in Vanity Van

కానీ ఇప్పటికే సితారపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పుకుంటున్నారు. మహేష్ , సితార కాంబినేషన్ లో ఆ సీన్ ఉంటుందని చెప్తున్నారు. ఈ సీన్ సినిమాలో హైలెట్ గా ఉంటుందని వినికిడి. అయితే ఇది రూమరా, నిజమా అనేది తేలాల్సి ఉంది.

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ముద్దులు కూతురు సితార కు మొదటి నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార చిన్నప్పటి నుంచీ లిటిల్ స్టార్. ముద్దులొలికే ఆమె ఫోటోలు అంటే మహేష్ ఫ్యాన్స్ కు భలే ఇష్టం. అలాంటిది ఆమె డాన్స్ చేసిన వీడియో గురించి చెప్పాలా...

Sitara annual day dance performance 👍👍👍👍👏👏👏👏👏

A video posted by Namrata Shirodkar (@namratashirodkar) on Mar 20, 2016 at 2:22am PDT


సితార ఇటీవల జరిగిన స్కూల్ డాన్స్ పోగ్రామ్ లో డాన్స్ చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో 'క్లాప్‌ క్లాప్‌' అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియోని సితార తల్లి నమ్రత ఇనిస్ట్రిగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానలకు అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

English summary
Mahesh daughter Sithara dance programme at her school viral in Social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu