»   » ‘బ్రహ్మోత్సవం’విడుదల తేదీ ప్రకటించిన మహేష్

‘బ్రహ్మోత్సవం’విడుదల తేదీ ప్రకటించిన మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందరూ ఊహించినట్లుగానే మహేష్ బాబు తన తాజా చిత్రం బ్రహ్మోత్సవం ఆడియో పంక్షన్ లో విడుదల తేదిని ప్రకటించారు. ఈ నెల 20 నుంచి మన బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి అని మహేష్ అఫీషియల్ గా స్టేజీపై ప్రకటన చేసారు.

మహేష్ మాట్లాడుతూ...''బ్రహ్మోత్సవం ఆడియో వేడుకకు మా పాప సితార రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సీనియర్‌ నటీనటులతో పనిచేశాను. కాజల్‌, సమంతతో మరలా నటించడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి.

Mahesh declares 'Brahmotsavam' release date!!

ఆయన ఇండస్ట్రీ వ్యక్తులతో అంతగా కలవరు కాబట్టి అంత తేటగా ఉన్నారేమోననిపిస్తుంది. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమాలు చేస్తాను. మిక్కీ మంచి సంగీతాన్నిచ్చారు. టెక్నీషియన్లందరూ శ్రద్ధగా పనిచేశారు.

ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే ఆ విషయాన్ని మాటల్లో చెప్పలేం. నేను నా అభిమానుల గురించి కూడా ఎప్పుడూ చెప్పలేదు. నా కెరీర్‌లో తోడున్న అభిమానులను ధన్యవాదాలు. వారెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఈ నెల 20 నుంచి మన బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి'' అని మహేశ్ అన్నారు.

Mahesh declares 'Brahmotsavam' release date!!


మహేష్ హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుక హైదరాబాద్‌లో శనివారం జరిగింది. మహేశ తొలి సీడీని ఆవిష్కరించారు. ట్రైలర్‌ను సత్యరాజ్‌, రేవతి, జయసుధ, సమంత, కాజల్‌ సంయుక్తంగా విడుదల చేశారు.

శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, ఎం.బి.ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పెరల్‌.వి.పొట్లూరి, పరమ్‌.వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు.

English summary
"For us, the Brahmotsavam starts from May 20th. That's when we start celebrating a festival", said Mahesh at the audio event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu