»   » మహేష్ ని మిస్ అయితే...ఈ నెంబరుకో ఓ మిస్ డ్ కాల్

మహేష్ ని మిస్ అయితే...ఈ నెంబరుకో ఓ మిస్ డ్ కాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఎప్పుడు ఏం చేస్తున్నాడు...అనే అప్ డేట్స్...ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ, వెబ్ సైట్స్ తిరగేసే వారికి నిత్యం దొరుకుతూనే ఉంటుంది. నెట్ అందుబాటులో లేని మహేష్ అభిమానులు పరిస్ధితి ఏమిటి...అందుకే వారి కోసం ఓ నెంబర్ ని తీసుకువచ్చారు. 08688464077 నెంబర్ కి ఒక్క మిసెడ్ కాల్ ఇస్తే మహేష్ అప్ డేట్స్ మొత్తం మీ మొబైల్ లో వాలిపోతాయి. ఈ మేరకు ఆగడు నిర్మాతలు ఏర్పాట్లు చేసారు. మరెందుకు ఆలస్యం...ఈ నెంబర్ కి ఓ మిసెడ్ కాల్ ఇవ్వండి.

ఇక మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై అందరి మన్ననలూ పొందింది. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం.

మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది.

Mahesh delights non netizens too

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary

 if any of Mahesh's fans who are not netizens wish to know about his latest updates then they can just give missed call to 08688464077 and they will get all info including Mahesh's tweets on their mobile number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu