»   » మహేష్ తో 'పడ్డాను నీతో ప్రేమలో' అంటున్న సమంత

మహేష్ తో 'పడ్డాను నీతో ప్రేమలో' అంటున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గురువారం మార్చి ఒకటి...ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ...పడ్డాను నీతో ప్రేమలో..."అంటూ పాటలు పాడుతోంది సమంత. ఈ పల్లవితో సాగే పాటను రామజోగయ్య శాస్ర్తీ రాయగా, శోభి నృత్యదర్శకత్వంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో మహేష్‌ బాబు, సమంతపై ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రామ్, అనిల్, గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న 'దూకుడు" చిత్రం కోసం ఆదివారం నుంచి ఈ మెలోడీ పాటను తెరకెక్కిస్తున్నారు. పదిహేను రోజులపాటు అక్కడ ఈ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ సమకూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu