twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో ఐదు సార్లు మహేష్ ఒక్కడికే, అందుకే ధాంక్స్ ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు తన లెటెస్ట్ చిత్రం 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అవటంతో ఏ విధంగానూ మీడియా ముందుకు రాలేదు, అలాగే ట్విట్టర్ లోకి సైతం ఆయన రాలేదు. ఎంతో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన చిత్రం మిజరబుల్ ప్లాప్ కావటం..ఎబ్రాసింగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఆయన మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చారు. ఓ ట్వీట్ చేసారు. అయితే హఠాత్తుగా ఆయన ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమిటీ అంటే ..ఈ క్రింద ట్వీట్ చూడండి..

    తాజాగా 2015 సంవత్సరానికి గానూ 'శ్రీమంతుడు' సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకొని మహేష్ మరోసారి తన స్థాయిని పెంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన అబిమానులకు,ఫిల్మ్ ఫేర్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కు కృతజ్ఞతలు తెలియచేసారు.


    మహేష్ తన కెరీర్లో ఇప్పటికి ఐదు ఫిల్మ్‌ఫేర్ సాధించారు. ఇక ఈతరం హీరోల్లో తెలుగులో ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న హీరో మరొకరు లేరు. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో 2015సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

    మహేష్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న చిత్రాలు ఇవే...

    ఒక్కడు

    ఒక్కడు

    ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా..గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒక్కడు' సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు మహేష్.

    పోకిరి

    పోకిరి

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘పోకిరి' చిత్రానికి ఆయన ఈ అవార్డ్ ని రెండో సారి అందుకున్నారు.

    దూకుడు

    దూకుడు

    శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొందిన ‘దూకుడు'చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డ్ ని మూడో సారి అందుకున్నారు.

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

    శ్రీకాండ్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి గానూ ఆయన నాలుగోసారి ఈ అవార్డ్ ని అందుకున్నారు.

    ‘శ్రీమంతుడు'

    ‘శ్రీమంతుడు'

    గ్రామాల దత్తత అనే సామాజిక సందేశం కూడా కలిసిన కమర్షియల్ చిత్రం .. ‘శ్రీమంతుడు'సినిమాలతో ఐదోసారి ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు.

    English summary
    Mahesh Babu took time to thank the fans on the eve of winning filmfare award as Best Actor for his performance in 'Srimanthudu'. He tweeted, “A Big Thank You to all my fans for making this possible.. Missed being there on the big night..Honoured to win the Filmfare Best Actor award for Srimanthudu. Thank you filmfare and the Times group.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X