»   »  ‘స్పైడర్’ హిందీ రిలీజ్ అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?

‘స్పైడర్’ హిందీ రిలీజ్ అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో రిలీజ్ చేయాలని ముందే నిర్ణయించారు. అయితే హిందీ రిలీజ్ మీద చిత్ర యూనిట్ కాస్త డౌట్‌ఫుల్‌గా ఉన్నట్లు సమాచారం.

ఏఆర్ మురుగదాస్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. అదే సమయంలో మహేష్ బాబుకు కూడా అక్కడ గుర్తింపు ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నప్పటికీ మహేష్ బాబు అడ్డు చెబుతున్నట్లు తెలుస్తోంది.


మహేష్ బాబు ఆలోచన అదే

మహేష్ బాబు ఆలోచన అదే

మహేష్ బాబు సినిమాలు ఇప్పటి వరకు హిందీలో శాటిలైట్(టీవీ) ద్వారానే రిలీజ్ అయ్యాయి. హిందీలో నేరుగా థియేట్రికల్ రిలీజ్ అయింది లేదు. ఈ నేపథ్యంలో ఫైనల్ కాపీ చూసిన తర్వాతే హిందీలో రిలీజ్ చేద్దామా? వద్దా? అనే నిర్ణయానికి వద్దామని మహేష్ బాబు సూచించారట.


Spyder Movie First Song 'Boom Boom'
ఆచితూచి అడుగులు వేద్దాం..

ఆచితూచి అడుగులు వేద్దాం..

ఎక్కడైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అందుకే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టే క్రమంలో మహేష్ బాబు ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.వాళ్లకి కనెక్టు అవుతుందా?

వాళ్లకి కనెక్టు అవుతుందా?

‘స్పైడర్' సౌత్ ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టుగా తెరకెక్కిన ఈ సినిమా. నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందా? లేదా? అనేది మహేష్ బాబు డౌట్. ఇది ఒక అనువాద చిత్రంగా అనిపిస్తే మొదటికే దెబ్బడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు హిందీ రిలీజ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


హిందీ రిలీజ్ ఇపుడు లేనట్లేనా?

హిందీ రిలీజ్ ఇపుడు లేనట్లేనా?

ఇటీవల తెలుగు, తమిళంలో స్పైడర్ ట్రైలర్లు విడుదల చేశారు కానీ, హిందీలో మాత్రం రిలీజ్ చేయలేదు. ఇప్పట్లో హిందీలో రిలీజ్ చేసే ఆలోచన లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్‌' కొత్త టీజర్‌ను విడుదల చేశారు.


మహేష్ బాబు వర్సెస్ ఎస్.జె.సూర్య

మహేష్ బాబు వర్సెస్ ఎస్.జె.సూర్య

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రజల ప్రాణాలు బలిగొంటూ వారిలో భయాన్ని పుట్టిస్తున్న ఓ రాక్షసుడి ఆట కట్టించే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తోంది.


సెప్టెంబర్ 27న రిలీజ్

సెప్టెంబర్ 27న రిలీజ్

నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్ట్‌ 9 మా హీరో మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ విడుదల చేశాం. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ ఒక్క పాట చిత్రీకరణ ఆగస్ట్‌ 23 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆల్‌రెడీ డబ్బింగ్‌, రీకార్డింగ్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.English summary
Mahesh who was keen on making his Bollywood debut with Spyder is still unclear about the Hindi version. The actor is said to take a call after he watches the final draft of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu