twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన శ్లోకాలు, పూజలు డీకోడ్ చేస్తే అన్నీ బూతులే: ‘జీఎస్టీ’ ఓంకారం వివాదంపై కత్తి మహేష్!

    By Bojja Kumar
    |

    రామ్ గోపాల్ వర్మ తెరక్కించిన న్యూడ్ ఫిల్మ్ జిఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వివాదం వర్మను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపిచే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా అంటే వర్మ జీఎస్టీలో ఓంకారం ఉపయోగించారంటూ రచయిత జయకుమార్ అనే వ్యక్తి కొత్త వివాదానికి తెరలేపారు. ఈ నేపషథ్యంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తనదైన వాదన వినిపించారు మహేష్ కత్తి.

    Recommended Video

    మర్మాంగంపై ఓంకారం ప్లే చేయడం చాలా దారుణం
     నేను రాసిన ‘జిఎస్టీ' రివ్యూకు కట్టుబడి ఉన్న

    నేను రాసిన ‘జిఎస్టీ' రివ్యూకు కట్టుబడి ఉన్న

    మహేష్ కత్తి ‘జిఎస్టీ' మీద తాను రాసిన రివ్యూలో ఓకారం మేడ్ ఎ డివైన్ అన్నారు. గాడ్ సెక్స్ ట్రూత్‌కు కూడా తనదైన నిర్వచనం ఇచ్చారు. మియా ఈజ్ సెక్స్, ఆర్జీవి ఈజ్ గాడ్, ఎంఎం కీరవాణి ఈజ్ ట్రూత్ అంటూ పొగిడారు. జీఎస్టీపై తన అభిప్రాయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని మహేష్ కత్తి స్పష్టం చేశారు.

     జీఎస్టీలో ఉన్న అసుల విషయం అదే

    జీఎస్టీలో ఉన్న అసుల విషయం అదే

    ఒక్కో సినిమా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థం అవుతుంది. నేను జీఎస్టీ ఇన్సియల్‌గా చూసినపుడు దాంట్లో ‘సెక్స్' అనే అంశాన్ని సమాజం ఎప్పుడూ సప్రెస్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఉమెన్ సెక్సువాలిటీని సమాజం సప్రెస్ చేస్తోంది. అటు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి, ఇటు సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సప్రెస్ చేస్తున్నట్లు ఉంది అని మహేష్ కత్తి తెలిపారు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు.

     కేవలం మియాకు సంబంధించిన అంశం కాదు

    కేవలం మియాకు సంబంధించిన అంశం కాదు

    కానీ మీరు దీన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదుకదా, ఇది మియాకు సంబంధించినటువంటి ఒక అంశం అని యాంకర్ వాదించగా, మహేష్ కత్తి స్పందిస్తూ ‘ఇది కేవలం మియాకు సంబంధించిన అంశం కాదు. రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం మియా అందులో మాట్లాడింది. అదే సమయంలో మియా తన సెక్సువాలిటీని సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో రెండు పార్టులు ఉన్నాయి. అందుకే మనకు అందులో మధ్య మధ్యలో కోట్స్ వస్తూ ఉంటాయి'.... అని తెలిపారు.

    రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజం.

    రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజం.

    సమాజంలో కొన్ని తరాలుగా ఉమెన్ సెక్సువాలిటీని సప్రెస్ చేస్తున్నారు. ఇపుడు నా శరీరాన్ని నా ఇష్టమైనట్లు సెలబ్రేట్ చేసుకుంటాను అనేది ఒక పాయింట్. అది ఎలా తీశారు? అందులో ఉన్న పాయింటుకు నేను అగ్రి అవుతానా? లేదా? అనేది ఒక పార్ట్ అయితే.... రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజం. సమాజం సెక్సువాలిటీని సప్రెస్ చేస్తుంది అనేది వాస్తవం. దానిపై రకరకాల ఫిలాసఫర్స్ రకరకాల టైమ్ ఆఫ్ స్పాన్ లో దాని గురించి మాట్లాడారు. అదీ నిజమే.... అని మహేష్ కత్తి చెప్పుకొచ్చారు.

    శ్లోకాలు డీకోడ్ చేస్తే అన్నీ బూతులే

    శ్లోకాలు డీకోడ్ చేస్తే అన్నీ బూతులే

    డివైన్ అని ఎందుకన్నానంటే ఇందులో ఒక స్పిరిచువల్ అంశం ఉంది. న్యూడిటీ అనేది మనకు కొత్తేమీ కాదు. నిజానికి మన స్లోకాలు, పూజలు అన్నీ డీ కోడ్ చేస్తే బూతులు తప్ప మరేమీ కనిపించవు. సుప్రభాతంతో సహా అన్నీ బూతులే.... అని మహేష్ కత్తి తెలిపారు.

    మేము ఇలాగే ఉంటాం అనుకుంటే కూడా కుదరదు

    మేము ఇలాగే ఉంటాం అనుకుంటే కూడా కుదరదు

    ఇప్పుడేదో మనం చాలా స్పిరిచువల్ అనేసుకుంటున్నాం కాబట్టి వీటన్నింటినీ తీసేని కేవలం మేము ఇలాగే ఉంటాం అనుకుంటే కూడా కుదరదు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిలీజియన్‌కు స్పిరిచువాలిటీకి మధ్య కొంత తేడా చూడాల్సిన అవసరం కూడా ఉంది.... అని మహేష్ కత్తి చెప్పుకొచ్చారు.

     ఇది ఇష్యూ చేయాల్సిన అంశమే కాదు

    ఇది ఇష్యూ చేయాల్సిన అంశమే కాదు

    జిఎస్టీలో ఓంకారం అనేది టైటిల్స్ వచ్చినపుడు మాత్రమే వస్తుంది. మిగతా చోట్ల ఎక్కడా ఓంకారం ఉండదు. ఇది ఇష్యూ చేయాల్సిన అంశమే కాదు..... అంటూ మహేష్ కత్తి వాదించారు.

    న్యూడిటీకి, పోర్నోగ్రఫీకి తేడా ఉంది

    న్యూడిటీకి, పోర్నోగ్రఫీకి తేడా ఉంది

    ఇది సినిమా కాదు. ఇది పోర్న్ అంతకన్నా కాదు. ప్రైవేట్ డొమైన్లో చాయిస్‌తో వెళ్లి చూడాల్సింది. న్యూడిటీకి, పోర్నోగ్రఫీకి చాలా తేడా ఉంది.... అని మహేష్ కత్తి తెలిపారు.

    English summary
    Mahesh Kathi interesting comments about 'Omkaram' controversy in GST. Writer Jaya Kumar has condemned the use of the sacred symbol in a porn film, Kathi Mahesh has justified it appropriate to the title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X