twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు రాజమౌళిని కూడా వదలని మహేష్ కత్తి, విమర్శిస్తూ కామెంట్స్...

    By Bojja Kumar
    |

    Recommended Video

    పవన్ నే కాదు.. రాజమౌళిని కూడా వదలని మహేష్ కత్తి !

    సినీ విమర్శకుడు మహేష్ కత్తి ఈ మధ్య పలు వివాదాస్పద అంశాలతో వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. ఇటీవల ఆయనకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య జరిగిన ఓ గొడవ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసి సంగతి తెలిసిందే.

    తాజాగా మహేష్ కత్తి రాజమౌళిని ఉద్దేశించి కామెంట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. కత్తి మహేష్ తన వ్యాఖ్యల్లో రాజమౌళి పేరు ప్రస్తావించక పోయినప్పటికీ.... ఆయన కామెంట్స్ ప్రముఖ దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేస్తున్నట్లే ఉన్నాయని అంటున్నారు.

    అసలు ఏం జరిగింది?

    ఏపీ కొత్త రాజధాని అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ భవన డిజైన్‌పై రాజమౌళి ఓ సూచన చేశాడు. అందులో ఎత్తైన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా ఓ డిజైన్ రూపొందించారు. అసెంబ్లీ సెంట్రల్‌ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు సూర్య కిరణాలు పడేలా చేసే కాన్సెప్టును రాజమౌళి సూచించారు.

     సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రాజమౌళి

    సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రాజమౌళి

    అసెంబ్లీ సెంట్రల్ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా తాను ఓ ఐడియా ఇచ్చానని, తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెబుతున్నట్లు రాజమౌళి వెల్లడించారు.

     కత్తి మహేష్ కామెంట్స్

    కత్తి మహేష్ కామెంట్స్

    తెలుగు తల్లి పాదాలపై సూర్య కిరణాల పడటం అనే కాన్సెప్టు గురించి.....కత్తి మహేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?'' అంటూ ప్రశ్నించారు.

     కత్తి మహేష్ కామెంట్లపై భిన్నవాదనలు

    కత్తి మహేష్ కామెంట్లపై భిన్నవాదనలు

    కత్తి మహేష్ బాదనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వాదనలు జరుగుతున్నాయి. కొందరు మహేష్ కత్తికి సపోర్టు ఇస్తుండగా, మరికొందరు ఆయన వాదనను తప్పుబడుతున్నారు.

    English summary
    Acclaimed filmmaker SS Rajamouli on recently met Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and discussed the designs for the dream capital, Amaravati. Rajamouli proposed a concept to install a statue of ‘Telugu Talli’ in the Assembly hall with the rays from rising sun falling on the same. Telugu movie critic Mahesh Kathi criticized Rajamouli Idea.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X