twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 2పై నెగిటివిటీ పెరిగింది, సంజన ఫీలవ్వడంలో తప్పులేదు: కత్తి మహేష్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mahesh Kathi Hot Comments On Bigg Boss 2 Telugu

    బిగ్ బాస్ గేమ్ నుండి తనను కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు చేసి బయటకు పంపారంటూ మిస్ హైదరాబాద్ సంజన అన్నె చేస్తున్న ఆరోపణలపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించారు. రెండో సీజన్ జరుగుతున్న తీరును, సంజన చేస్తున్న ఆరోపణలపై ఆయన తనదైన రీతిలో స్పందించారు. సంజనకు మద్దతు ఇస్తూనే... బిగ్ బాస్ నిర్వాహకులు పాలిటిక్స్ చేస్తున్నారన్న ఆమె ఆరోపణలను తోసి పుచ్చారు.

    నెగిటివిటీని ఎక్కువ పెంచింది అనిపిస్తోంది

    నెగిటివిటీని ఎక్కువ పెంచింది అనిపిస్తోంది

    మొదటి సీజన్లో మేము చేసినపుడు కాంపిటీషన్ అనేది మూడో వారం, నాలుగో వారం నుండి మొదలైంది. గేమ్ సీరియసైన కొద్దీ ఎవరినో ఒకరిని బయటకు పంపాలి, మనతో స్నేహం ఉన్నా? లేక పోయినా గేమ్ ఆడాలి. కానీ ఈ సారి ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని జైల్లో పెట్టేయడంతో కాంపిటీషన్ మొదలైంది. ఒక ఫ్యామిలీగా కలిసుండే ప్రయత్నం చేద్దామనే ఆలోచన కూడా లేకుండా శత్రువర్గాలు, మిత్ర పక్షాలుగా మారిపోయి గొడవలు జరిగేంత స్థాయికి సీజన్ 2ను ముందుకు తీసుకెళ్లడం అనేది కొంత నెగిటివిటీని ఎక్కువ పెంచింది అనిపిస్తోంది. అందుకే అక్కడ మొదటి రోజు నుండే కుట్రలు ప్రారంభం అయ్యాయని సంజన ఫీలవ్వడంలో తప్పులేదు.... అని మహేష్ కత్తి అన్నారు.

     ఈ సారి అందుకే ఎక్కువ కాంపిటీషన్

    ఈ సారి అందుకే ఎక్కువ కాంపిటీషన్

    గత సీజన్‌ గేమ్‌లో కొంత వెసులుబాటు ఉండేది. ఇంకా గేమ్ ఇవాల్వ్ అయ్యేంత వరకు కొంత టైమ్ ఇచ్చారు. ఈ సారి అంత టైమ్ ఇవ్వలేదు. ఎక్కడైనా సరే గేమ్ ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకెళ్లాలి. అది ప్రేక్షకులను రంజింప చేయాలి. కొంత టెన్షన్ పెట్టాలి, కొంత ఎమోషనల్ హైప్ ఇవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ సారి సామాన్యులు కూడా ముగ్గురు లోపలికి వెళ్లడంతో గేమ్ స్టేక్స్ పెరిగాయి. అందుకే కొంచెం ఎక్కువ కాంపిటీషన్ మొదలైంది.

    సంజన వాదనతో విబేధించిన మహేష్ కత్తి

    సంజన వాదనతో విబేధించిన మహేష్ కత్తి

    బిగ్ బాస్ ఇంట్లో రాజకీయాలు జరుగుతున్నాయని, అలా చేసే నన్ను బయటకు పంపారు అని సంజన అనగా.... దీనిపై మహేష్ కత్తి స్పందిస్తూ అక్కడ రాజకీయాలతో వారు నామినేట్ అయితే చేయగలరు కానీ, ఎలిమినేట్ చేయలేరు. అది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది అని మహేష్ కత్తి తెలిపారు.

     బిగ్ బాస్ నిర్వాహకులపై అభాండాలు

    బిగ్ బాస్ నిర్వాహకులపై అభాండాలు

    ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేశారని భావించడం లేదు. అదే నిజమైతే నేను బయటకు వచ్చిన రోజునే నందినీ రాయ్ ను ఎందుకు లోనికి పంపారు? ఒక వేళ ఆమెను పంపకపోతే నేను అలా అనుకునేదాన్ని కాదేమో? ఇందులో బిగ్ బాస్ నిర్వాహకులు రాజకీయం కూడా ఉందని భావిస్తున్నాను అని సంజన అన్నారు.

    విలువల విషయంలో కాంప్రమైజ్ అవ్వరన్న కత్తి

    విలువల విషయంలో కాంప్రమైజ్ అవ్వరన్న కత్తి

    సంజన వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందిస్తూ....అలా అనడం ఆపాదన అవుతుందే తప్ప దాన్ని ప్రూవ్ చేయలేం. బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్న ఎండమోల్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. గేమ్ ఫార్మాట్ వారి ఓనర్ ‌‌షిప్‌లో ఉంది. ప్రైజ్ వాటర్ అండ్ కూపర్స్ ఏజెన్సీ ఆడిటర్‌గా ఈ కార్యక్రమాన్ని చూస్తోంది. వచ్చిన ఎట్లను జనాలకు చూపించక పోవచ్చు కానీ... ఒక మెథడాలజీ, అకౌంటబిలిటీ ఆ కంపెనీకి ఉంది. ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న అలాంటి కంపెనీలు గేమ్ కోసమో, ఒక చిన్న క్యాండిడేట్ కోసమో వారి విలువల విషయంలో కాంప్రమైజ్ అవుతారని నేనైతే నమ్మను అంటూ కత్తి మహేష్ తోసి పుచ్చారు.

    English summary
    Mahesh Kathi hot commets on Bigg Boss 2 and supports eliminated contestant Sanjana Anne. Model Sanjana Anne, who entered the Big Boss 2 program as a commoner, is the first one to be sent out from the house. But the part-time actress claims that she's sent out of the house for her super honesty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X