»   » ‘జై సింహ’ కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

‘జై సింహ’ కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘జై సింహ' పై కత్తి మహేష్ ఏమన్నాడో తెలుసా ?

టాలీవుడ్లో వివాదాస్పద సినీ విమర్శకుడిగా పేరు గాంచిన మహేష్ కత్తి పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన రివ్యూల మూలంగా చాలా మంది హీరోల అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు కూడా. పవన్ కళ్యాణ్ అభిమానులతో కొన్ని రోజులుగా మహేష్ కత్తి పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. మొన్న విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమాను రివ్యూ చేసిన తనదైన అభిప్రాయాలు వెల్లడించిన మహేష్ కత్తి తాజాగా బాలయ్య 'జై సింహ' చిత్రంపై విమర్శనాత్మకంగా స్పందించారు.

 మరీ ఇంత ఓల్డా?

మరీ ఇంత ఓల్డా?

‘జై సింహ' కథ కథనాలు చాలా పాతగా అనిపిస్తాయని, 1980ల్లో, 1990ల్లో వచ్చిన రివేంజ్ డ్రామాలు, ఫ్యామిలీ డ్రామాల కలగాపులగం అయినటువంటి కలెగూర గంపగా ఈ సినిమా ఉందని మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.

 చివరి వరకు కథ ఎటు వెళుతుందో తెలియదు

చివరి వరకు కథ ఎటు వెళుతుందో తెలియదు

మొదటి నుండి సినిమా ఎటు వెళుతుంది అనే సందేహంలో ప్రేక్షకులు ఉండిపోతారు. కనీసం సెకండాఫ్ కూడా కథ మొదలవుతుంది అనే భావనలో మనం ఉంటే లాస్ట్ పది పదిహేను నిమిషాల్లో అసలు కథేమిటో చెప్పాపరు. అప్పటికి గానీ అదొక ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన కథ, బాలకృష్ణ గారి సెంటిమెంటుకు సంబంధించిన కథ అనే విషయం అప్పటి వరకు అర్థం కాదు అని మహేష్ కత్తి తెలిపారు.


 ఫ్యాన్స్ కూడా నిరాశ పడే విధంగా ఉంది

ఫ్యాన్స్ కూడా నిరాశ పడే విధంగా ఉంది

బాలకృష్ణ ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఫ్యూడల్ కథలు, మహరాజులాగా ఉండే నాయకుడు, ఆ నాయకుడికి ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూలు ఉండే కథలు చేశారు. కానీ ‘జై సింహ'లో ర్యాండమ్‌గా ఒక ప్యాసివ్ క్యారెక్టర్‌తో బాలయ్య చేయడం ఫ్యాన్స్‌ను కూడా నిరాశ పరిచే విధంగా ఉంటుందని మహేష్ కత్తి తెలిపారు.


 కథలో ఆయన ఉంటాడే తప్ప ఆయన వల్ల కథ నడవదు

కథలో ఆయన ఉంటాడే తప్ప ఆయన వల్ల కథ నడవదు

‘కథలో బాలయ్య ఉంటాడే తప్ప ఆయన వల్ల కథ నడవటం అనేది కనిపించదు. కేవలం ఘటనలు, కొన్ని సంఘటనల నేపథ్యంలోతన జీవితం అలా గడిచి పోతూ ఉంటుంది' అని కత్తి తెలిపారు.


కథ, కథనాలు ఏ మాత్రం రంజింప జేయదు

కథ, కథనాలు ఏ మాత్రం రంజింప జేయదు

సినిమా ప్రారంభంలో పిల్లవాడితో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న హీరోగా బాలయ్య కనపడతారు. ఆ తర్వాత అసలు ఆ పిల్లాడికీ, నయనతారకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు వచ్చే సరికి నయనతార కోసం బాలకృష్ణ ఎంత త్యాగం చేశారు అనేది తెలుస్తుంది. నరసింహ అనే పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. నిజానికి కథ, కథనాలు ఏ మాత్రం రంజింప జేయదు.... అని కత్తి అభిప్రాయ పడ్డారు.


 ఆ పాత్రలో లేని బలం

ఆ పాత్రలో లేని బలం

బాలకృష్ణ గారి యాక్టింగ్ పాత్రోచితంగా ఉన్నప్పటికీ ఆ పాత్రలో లేని బలం, ఆ పాత్రలో లేని హీరోయిజంతో సినిమా చాలా వరకు చప్పగా అనిపిస్తుంది.... అని కత్తి తెలిపారు.


 ఎంజాయ్ చేయలేని పరిస్థితి

ఎంజాయ్ చేయలేని పరిస్థితి

ఫైట్స్ కంపోజిషన్స్ బావున్నప్పటికీ సినిమా ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడంతో మనం వాటిలో కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి దాపురించింది.... అని కత్తి అభిప్రాయ పడ్డారు.


 నయనతార పాత్ర మాత్రమే

నయనతార పాత్ర మాత్రమే

ఉండటానికి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో నయనతార పాత్ర మాత్రమే పాత్రోచితంగా ఉన్నట్లు అనిపిస్తుంది.... అని కత్తి తెలిపారు.


కామెడీ పండలేదు

కామెడీ పండలేదు

బ్రహ్మాందంతో పాటు చాలా మంది కామెడీ పండించడానికి ట్రై చేసినప్పటికీ ఏ మాత్రం పండని మొదటి భాగం, సెకండాఫ్ లో కామెడీ ఏమీ లేక పోవడం ఈ రెండు మనల్ని నిరాశ పరుస్తాయి.... అని కత్తి తెలిపారు.


 టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

చిరంతన్ భట్ సంగీతం రెండు పాటల్లో బావుంది. మిగతా అంతా ఆశించిన స్థాయిలో లేదు. ఫైట్స్ మాత్రమే ఈ సినిమాలో బావున్నాయి. రజనీకాంత్ తో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు కెఎస్.రవికుమార్ ఇందులో లేని కథ, పొసగని కథనంతో చతికిల పడ్డాడు. ఈ సంక్రాంతి ‘జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది... అని కత్తి అభిప్రాయ పడ్డారు.


English summary
Kathi Mahesh Review About Balakrishna's "Jai Simha". Jai Simha produced by C. Kalyan on C. K. Entertainments banner and directed by K. S. Ravikumar. Starring Nandamuri Balakrishna, Nayanthara, Natasha Doshi, Hariprriya in the lead roles and music composed by Chirantan Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X