For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బిగ్ బాస్’ మీద మహేష్ కత్తి పుస్తకం, అర్చనపై సంచలన కామెంట్

  By Bojja Kumar
  |

  'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత మహేష్ కత్తి మరింత పాపులర్ అయ్యాడు. అప్పటి వరకు సినిమా సర్కిల్, మీడియా సర్కిల్‌ వాళ్లకు తప్ప బయటి జనాలకు మహేష్ కత్తి గురించి చాలా తక్కువ. అయితే 'బిగ్ బాస్' షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయారు.

  బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత మహేష్ కత్తి మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయ్యారు. షోలో జరిగిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కత్తి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  ఊహించలేదు

  ఊహించలేదు

  బిగ్ బాస్ షోలో అవకాశం వస్తుందని తాను ఊహించలేదని మహేష్ కత్తి తెలిపారు. బిగ్ బాస్ నిర్వాహకులు నన్ను సంప్రదించినపుడు తాను పెద్ద సెలబ్రిటీని కాదని చెప్పాను, నా గురించి తెలిసే తీసుకుంటున్నామన్నారు, వారిచ్చే రెమ్యూనరేషన్ కూడా బావుందని అనిపించింది. రెండు వారాలు అగ్రిమెంట్ రాసిచ్చాను. అయితే నాలుగు వారాలు కొనసాగడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది అని మహేష్ కత్తి తెలిపారు.

  Bigg Boss Telugu : Mahesh Kathi eliminated And shares last words
  డబ్బు కోసం కాదు

  డబ్బు కోసం కాదు

  అయితే డబ్బు కోసం మాత్రమ నేను ‘బిగ్‌ బాస్‌' హౌస్‌లోకి వెళ్లలేదు. బయటి ప్రపంచంతో సంబంధంలేని ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నాననీ, ఆ అనుభవం ఎలా ఉంటుందోననే అకడమిక్‌ ఇంటరెస్ట్‌తోనే వెళ్లాను అని మహేష్ కత్తి తెలిపారు.

  మొదటి వారమే ఎలిమినే అనుకున్నాను..

  మొదటి వారమే ఎలిమినే అనుకున్నాను..

  బిగ్ బాస్ ఇంట్లో సంపూర్ణేశ్‌బాబు, ధనరాజ్‌ తప్ప నాకు మిగతావాళ్లు పరిచయం లేరు. వయసులో అందరికంటే నేనే పెద్ద. నేను కాస్త రిజర్వ్ కాబట్టి మొదటి వారం ఎవరికీ దగ్గరకాలేకపోయాను. నా ప్రవర్తన చూసి మొదటి వారమే ఎలిమినేట్ చేస్తారనుకున్నాను. కానీ తర్వాత అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేశాను అని మహేష్ కత్తి తెలిపారు.

  సంపూ ఉండలేక పోయాడు

  సంపూ ఉండలేక పోయాడు

  సంపూర్ణేష్ బాబు గేమ్‌ ఫార్మట్‌ను అర్థం చేసుకోకుండా ఈ షోకి వచ్చాడు. క్లాస్ట్రోఫోబియాకు గురయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో బంధీలా ఉండలేక పోయాడ. సినిమాల్లో ఒక హీరోగా అందర్నీ అలరించిన అతను ఇక్కడ చిన్న పిల్లాడిగా మారిపోయి ఏడ్చేశాడు. యాక్టర్‌గా ఓకే కానీ ఒక మనిషిగా అతను చాలా బలహీనుడనే విషయం తెలిసింది. అతని బాధని మేం చూడలేకపోయాం. అతడు వెళ్లి పోవడమే మంచిది అయింది. లేక పోతే మానసికంగా మరింత దెబ్బతినేవాడు అని.... మహేష్ కత్తి తెలిపారు.

  ముమైత్ విభిన్నం

  ముమైత్ విభిన్నం

  బిగ్ బాస్ ఇంట్లో ముమైత్ ఖాన్‌తో మంచి స్నేహం కుదిరింది. మనకు ఆమె ఒక ఐటమ్‌ గాళ్‌, సెక్స్‌ బాంబ్‌ అనే ఇమేజ్‌‌తో మాత్రమే తెలుసు. కానీ అక్కడ చాలా సింపుల్‌గా కనిపించింది. తాను ఏ ఉద్వేగాన్ని దాచుకోలేదు. నేను ఇంటి నుండి బయటకు వస్తుంటే ఏడ్చేసింది... అని మహేష్ కత్తి తెలిపారు.

  ఎన్టీఆర్ ఆత్మబంధువు

  ఎన్టీఆర్ ఆత్మబంధువు

  బిగ్ బాస్ హోస్ట్‌గా ఎన్టీఆర్‌ బాగా సూటయ్యారు. ఇంట్లో ఎప్పుడూ అవే ముఖాలు చూస్తూ అంతా విసుగెత్తి పోతాం. వారాంతంలో తారక్ వచ్చినపుడు అంతా సంతోషంగా ఉంటా. మాతో ప్రేమగా మాట్లాడుతూ, మా తప్పొప్పుల్ని ఎత్తి చూపించి పర్సనల్‌ లెవల్‌లో కనెక్టయిపోతారు. ఆయన సమయంలో తారక్ మాకు ఆత్మబంధువుగా కనిపిస్తారే తప్ప ఒక స్టార్‌గా కనిపించరు. నేను నాలుగు వారాలు కొనసాగనంటే తారక్ ఇచ్చిన మనోబలమేకారణమని మహేష్ కత్తి తెలిపారు.

  ప్రిన్స్ గెలిచే అవకాశం ఉంది

  ప్రిన్స్ గెలిచే అవకాశం ఉంది

  బిగ్ బాస్ ఇంట్లో ప్రిన్స్ మంచి స్పిరిట్‌తో గేమ్‌ ఆడుతున్నాడు. ఈ షోలో ఫైనల్‌గా ప్రిన్స్‌ గెలిచే అవకాశం ఉంది. అతను ఎదుటివాళ్లను ఓడించి గెలవాలనుకోవట్లేదు. తను గెలిచే ప్రయత్నంలో మిగతా వాళ్లు ఓడిపోతారనే భావనతో ఆడుతున్నాడని మహేష్ కత్తి తెలిపారు.

  అర్చన గురించి సంచలన కామెంట్

  అర్చన గురించి సంచలన కామెంట్

  మనిషితనం కోల్పోయి గేమ్‌ గెలిచినా జనం మనసుల్ని గెలవలేరు. ఎవరెవరైతే మానవత్వాన్ని నిలుపుకొని బయటకు వస్తారో వాళ్లను ఈ సమాజం మరో స్థాయికి తీసుకెళ్లి సెలబ్రిటీలను చేస్తుంది. మానవత్వాన్ని కోల్పోయి బయటకు వచ్చిన వాళ్లను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. నాకు తెలిసి బయటకు వచ్చాక అర్చన పరిస్థితి దారుణంగా ఉంటుందని.... మహేష్ కత్తి సంచలన కామెంట్ చేశారు.

  ఆమెకు అవకాశాలే రాని పరిస్థితి వస్తుంది

  ఆమెకు అవకాశాలే రాని పరిస్థితి వస్తుంది

  అర్చనకు ఉన్న అవకాశాలే తక్కువ. ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు అవకాశాలు లేని పరిస్థితి వస్తుంది. మొత్తం ప్రపంచం నిజంగా అర్చన ఏమిటనేది చూసేసింది. ‘నేను అది కాదు మొర్రో' అన్నా కూడా ఎవరూ నమ్మరు. అర్చన ప్రవర్తనతో ఆమె చాడీలు చెప్పే రకం, ఫ్రెండ్‌షిప్‌ కోసం నిలవని రకమని అందరికీ తెలిసింది. ఈ షో ద్వారా ‘స్టార్స్‌ ఆర్‌ మేడ్‌.. స్టార్స్‌ ఆర్‌ బ్రోకెన్‌' అనే విషయం కూడా రుజువవుతుంది అని.... మహేష్ కత్తి అన్నారు.

  బిగ్ బాస్ మీద పుస్తకం

  బిగ్ బాస్ మీద పుస్తకం

  అన్ని రకాలుగానూ ‘బిగ్ బాస్' గేమ్‌ను గమనించే అవకాశం కలిగింది. ఈ షో గురించి నిర్మాణాత్మక పద్ధతిలో రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. గేమ్‌ థియరీ, సైకో సోషల్‌ అనాలసిస్‌, షో ప్యాకేజింగ్‌కు సంబంధించిన టెలివిజన్‌ ప్రొడక్షన్‌, ఆడియెన్స్‌ రీసెర్చ్‌ అనే అంశాలుగా విభజించుకొని ప్రధానంగా నాలుగు చాప్టర్‌లతో ఓ పుస్తకం తీసుకొద్దామనుకుంటున్నా. వాటితో పాటు కంటెస్టెంట్‌ల అనుభవాలూ పొందుపరుస్తాను, పుస్తకం ఎప్పుడు వస్తుంది అనేది త్వరలో వెల్లడిస్తాను అని మహేష్ కత్తి తెలిపారు.

  English summary
  Mahesh Kathi's Book on Jr NTR's Big Boss . Bigg Boss is the most happening TV show that has been in discussion among the people and social networking sites ever since it started.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X