twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కత్తిపై ఎమ్మెల్యే పోలీస్ కంప్లైంట్: సీరియస్ అవుతున్న వ్యవహారం

    |

    సినీ విమర్శకుడు మహేష్ కత్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నగర పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రిని నరహంతకుడని వ్యాఖ్యానించడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహేష్ కత్తి టార్గెట్ చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజాసింగ్ ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు సానుకూలంగా స్పందించారు.

     మహేష్ కత్తి

    మహేష్ కత్తి

    ఇటీవలి కాలంలో జనసేన పార్టీపై - పవన్ పై మహేష్ కత్తి విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తాజాగా పవన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పై పవన్ పరోక్షంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

     నరహంతకులకు సపోర్ట్

    నరహంతకులకు సపోర్ట్

    ఇలా పవన్ స్పందించిన అంశాలపై మహేష్ కత్తి ఓ ట్వీట్ లో ఘాటుగా రియాక్టయ్యాడు. `ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నరహంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాదులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా? మోడీ ప్రధాని అయినంత మాత్రానా ఏం చేసినా రైట్ అయిపోతుందా?.. నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉంది` అని మహేష్ కత్తి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    రాజాసింగ్ లోథ్

    రాజాసింగ్ లోథ్

    కత్తి మహేష్ చేసిన పోస్ట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ స్పందించారు. ఓ ట్వీట్లో ఆయన రియాక్టవడమే కాకుండా...అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. `ఛీప్ పబ్లిసిటీతో ఫేమస్ అవడం కోసం దేశ ప్రధాని పై ఆరోపణలు చేయడం తగదు. మహేశ్ కత్తి పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ లను కోరుతున్నాను` అని పోస్ట్ చేశారు.

     కత్తిని అరెస్ట్ చేస్తారా

    కత్తిని అరెస్ట్ చేస్తారా

    కాగా ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించారు. `మహేష్ కత్తిపై చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము వివరిస్తాం` అని చెప్పారు. ఓవైపు ఎమ్మెల్యే ఫిర్యాదు...మరోవైపు పోలీసుల స్పందన నేపథ్యంలో మహేష్ కత్తిని అరెస్ట్ చేస్తారా అనే చర్చ పలువురిలో సాగుతోంది.

     కంగారు పడకండి

    కంగారు పడకండి

    అయితే ఈ వ్యవహారాన్ని కత్తి మాత్రం పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు లేదు.... ట్విట్టర్‌లో తనపై రాజాసింగ్ ఫిర్యాదు విషయం తెలుసుకున్న కత్తి మహేష్ ‘‘చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్‌లైన్లో పోలీసులకి కంప్లయింట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు కంగారు పడకండి. ఆ కంప్లయింటు చెల్లదు. అది అసలు కేసే కాదు. నాకు చట్టం గురించి బాగా తెలుసు. డోంట్ వర్రీ'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు.

    English summary
    This time Mahesh Kathi has fallen in trouble for his big mouth targeting Prime Minister Narendra Modi calling him a “Murderer” through his facebook post. BJP MLA Raja Singh approached Hyderabad Police to action against Mahesh Kathi who positively responded.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X