»   » ఆ వ్యాఖ్యలు సరి కాదు: ఎన్టీఆర్ పై దూసిన మహేష్ "కత్తి"

ఆ వ్యాఖ్యలు సరి కాదు: ఎన్టీఆర్ పై దూసిన మహేష్ "కత్తి"

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిటిక్ గా, సినిమా వ్యక్తిగా చాలా ఏళ్ళ నుంచే ఇండస్త్రీలో ఉన్నా ఈ మధ్య పవన్ కళ్యాణ్ విషయం లో బాగా వార్తల్లోకనిపించాడు మహేష్ కత్తి. అక్కడి నుంచీ మహేష్ ఏం మాట్లాడినా అది వెనువెంటనే వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలం లో చాలామంది ఎదురు చూసిన విషయం మహేష్ కత్తి ఇచ్చే జై లవకుశరివ్యూ. ఎందుకంటే దీనికి కొద్దిరోజుల కిందటే ఎన్టీఆర్ ని బిగ్ బాస్ ప్రోగ్రాం కోసం కలిసాడు మహేష్. ఆ తర్వాత ఒక వ్యక్తిగా తారక్ తనకు చాలా నచ్చాడంటూ చెప్పాడు కూడా.

జై లవకుశ రివ్యూ

జై లవకుశ రివ్యూ

ఈ నేపథ్యం లో ఇప్పుడు వచ్చిన జై లవకుశ రివ్యూ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని దెబ్బ కొడుతూ తాను ఈ సినిమాకి రివ్యూ రాయలేకపోతున్నానై చెప్పి నిరాశపరిచాడు. ఎందుకంటే అదే సమయం లో బిగ్ బాస్ ముగింపు కార్యక్రమం లో పాల్గొనాల్సి రావటం మరింత కలిసి వచ్చింది.

Jai Lava Kusa Success Meet : NTR counters film critics strongly
జూనియర్ వ్యాఖ్యలని ఖండించాడు

జూనియర్ వ్యాఖ్యలని ఖండించాడు

అయితే తాను వ్యక్తిగత విషయాలకీ తన స్వభావానికీ విరుద్దంగా ఉంటానని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఎందుకంటే... తాజాగా సక్సెస్ మీట్ లో జూనియర్ వ్యాఖ్యలని ఖండించాడు మహేష్. 'జై లవకుశ' విజయోత్సవ సభలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను సినీ క్రిటిక్‌గా మహేష్ కత్తి ఖండించాడు.

క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవవు

క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవవు

సినిమాలపై విమర్శ అనేది సినిమాని బట్టే ఉంటుందని... క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవవని అన్నాడు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని... వాళ్ల అభిప్రాయాలను వెల్లడించేవాడే క్రిటిక్ అని చెప్పాడు. ప్రేక్షకుడు తన అనుభూతిని మాత్రమే చెబుతాడని... క్రిటిక్ తన అనుభూతినే కాకుండా, ఆలోచనలను కూడా పంచుకుంటాడని తెలిపాడు. అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు, క్రిటిక్ కు లేదని అనడం తప్పని అన్నాడు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమని చెప్పాడు.

దాంట్లో వాస్తవం లేదు

దాంట్లో వాస్తవం లేదు

ఒక విశ్లేషకుడు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి ప్రేక్షకులు సినిమా చూస్తారనే దాంట్లో వాస్తవం లేదని మహేష్ అన్నాడు. క్రిటిక్స్ అందరూ కూడా సినిమా బాగోలేదనే రేటింగ్ ఇచ్చినా... ఆ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు.

పాప్యులారిటీ అనవసరం

పాప్యులారిటీ అనవసరం

క్రిటిక్ అభిప్రాయం వల్లే సినిమా ఆడలేదనే విషయాన్ని తాను నమ్మనని తెలిపాడు. అనవసరంగా క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ, తనలాంటివారికి అనవసరంగా పాప్యులారిటీ పెంచుతున్నారని అన్నాడు. క్రిటిక్స్ కు పాప్యులారిటీ అనవసరమని... వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దని సూచించాడు.

English summary
Movie Critic Mahesh Katti responded on ntr's Coments on Film Critics in Jai Lava Kusa succes Meet
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu