»   » మహేష్ 'ఖలేజా' కి ఇప్పుడు అనుష్క దెబ్బ...

మహేష్ 'ఖలేజా' కి ఇప్పుడు అనుష్క దెబ్బ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలే ఆలస్యమయిపోతోందని బాధపడుతున్న మహేష్ 'ఖలేజా' చిత్రానికి తాజాగా అనుష్క దెబ్బ కొట్టింది. జూలై 26 నుంచి ఇక్రిశాట్ లో ఆమె కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేసారు. అయితే ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోయింది. దాంతో ఆగస్టు 14 తర్వాత నుంచి ఆమెతో షూట్ ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్క ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో మహేష్ చెయ్యాల్సిన సీన్స్ కు మూడు రోజులు కావాలి. వీటిలో ఒకరోజు అనుష్క కాంబినేషన్ ఉందిట. దాంతో కంటిన్యూగా ప్రకాష్ రాజ్ డేట్స్ కావాలంటే మధ్యలో అనుష్క సీన్ మిగిలిపోతుందని ఆలోచిస్తున్నారు.

మరో ప్రక్క ప్రకాష్ రాజ్ తో తియ్యాల్సిన సీన్స్ ని లొకేషన్ మార్చి బెంగుళూరులో షూట్ చెయ్యాలి. దాంతో ఈ సీన్స్ లు ఈ ఆగస్టు మూడవ వారంలో ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్క ఖలేజా కి రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి. మహేష్ మీద తియ్యాల్సిన ఇంట్రడక్షన్ సాంగ్, మరో డ్యూయిట్ చెయ్యాలి. సెప్టెంబర్ మొదటి వారంలో డ్యూయిట్ కి ప్లాన్ చేసారు. వీటితో పాటు మరో ప్రక్క జోరుగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ హైదరాబాద్ లోనూ, డిఐ వర్క్ ముంబై ప్రైమ్ ఫోకస్ ల్యాబ్ లోనూ జరుగుతోంది. ఇవన్నీ సక్రమంగా పూర్తయ్య్ సరికి వచ్చే నెల 15 తేది వస్తుందని, అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu