మహేష్ -కొటాల శివ ‘శ్రీమంతుడు’ రిలీజ్ డేట్
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (తాత్కాలిక టైటిల్ శ్రీమంతుడు) రిలీజ్ డేట్ ఖరారైంది. షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై 17న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు. క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











