»   » తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చే పవర్ ఫుల్ మూవీ.., రిలీజ్ డేట్ చెప్పేసారు.. మహేష్ బాబు.., కొరటాల..

తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చే పవర్ ఫుల్ మూవీ.., రిలీజ్ డేట్ చెప్పేసారు.. మహేష్ బాబు.., కొరటాల..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్న మహేష్ బాబు.. అది పూర్తి కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్‌పై ఇరువురి అభిమానుల్లోనూ మంచి అంచనాలే వున్నాయి. అభిమానుల్లో ఇప్పటినుంచే ఆసక్తి కలిగిస్తున్న ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' టైటిల్ ఓకే అయిపోయినట్టే. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఇదే టైటిల్ తో సినిమా వస్తుందని ఫిక్సయ్యారంతా.. పొలిటికల్ డ్రామాగా, సోషల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని అంటున్నారు.

మహేష్ బాబు తొలిసారిగా తెరపై సీఎంగా కనిపించబోతున్నాడనే వార్త వినగానే.... అసలు కథ ఏ రేంజిలో ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొరటాల శివ ఏ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కి సంబందించిన మరో న్యూస్ బయటికివచ్చింది అదేమిటంటే....

అంచనాలు భారీగా ఉన్నాయి :

అంచనాలు భారీగా ఉన్నాయి :

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే రెండో సినిమాకు ఇంకా రెగ్యులర్ షూటింగే మొదలవలేదు. అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేష్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

భరత్ అనే నేను:

భరత్ అనే నేను:

ఈ సినిమాకు 'భరత్ అనే నేను' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల గత సినిమాల్లో మాదిరే ఇందులోనూ సామాజిక అంశాలకు పెద్ద పీట వేస్తారట. సామాజికాంశాలని కలుపుకొని సినిమా తీయటం కొరటాల స్టైల్.. ఇదే ఫార్ములాని వాడి సూపర్హిట్లు కొట్టాడన్న సంగతి తెలిసిందే.

 ప్రారంభోత్సవ సమయంలోనే :

ప్రారంభోత్సవ సమయంలోనే :

ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలవుతుంది. కొరటాల గత సినిమా 'జనతా గ్యారేజ్' కి కూడా ప్రారంభోత్సవ సమయంలోనే రిలీజ్ డేట్ ఇచ్చారు. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే బాగానే ఉండేది

మురుగదాస్ దర్శకత్వంలో:

మురుగదాస్ దర్శకత్వంలో:

కానీ.. షెడ్యూళ్లు కొంచెం డిస్టర్బ్ కావడంతో ఆ డేట్‌ను అందుకోలేకపోయారు. మరి మహేష్ సినిమా విషయంలో కొరటాల ఏం చేస్తాడో చూడాలి. మరోవైపు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా ఏప్రిల్ ప్రథమార్ధంలో వచ్చే అవకాశముంది. అంటే ఐదు నెలల వ్యవధిలో మహేష్ రెండు సినిమాలతో పలకరించబోతున్నాడన్నమాట.

శ్రీమంతుడును మించిన హిట్:

శ్రీమంతుడును మించిన హిట్:

బహుశా హీరోగా మహేష్ కెరీర్లో ఇంత తక్కువ వ్యవధిలో రెండు సినిమాలు రావడం ఇదే తొలిసారేమో .శ్రీమంతుడు సినిమాలో... ఊరికి ఉంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్టు హైలెట్ అయినట్లే, ఇందులోనూ అలాంటి ఒక హైలెట్ అయ్యే ఎలిమెంటును కొరటాల శివ చూపించబోతున్నారని, ఈ సినిమాపై మహేష్ బాబు ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారని, తన కెరీర్లో శ్రీమంతుడును మించిన హిట్ ఈసినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారని అంటున్నారు.

బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో :

బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో :

సినిమా తరువాత సినిమా చేసే మహేష్ బాబు కాస్త స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రిన్స్ ఓ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. శ్రీమంతుడు భారీ హిట్టు తరువాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్రహ్మోత్సవం స్టార్ట్ చేసిన ప్రిన్స్ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో కాస్త టైం తీసుకుని మురుగదాస్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీతో పాటు రిసెంట్ గా కొరటాల డైరెక్షన్ లో న్యూ మూవీని స్టార్ట్ చేశాడు.

సినిమా ప్రారంభోత్సవం రోజే:

సినిమా ప్రారంభోత్సవం రోజే:

ఈ మూవీ రాజకీయాల నేఫథ్యంలో నడుస్తుందట. భరత్ అను నేను టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చేస్తుందని ఈ దర్శకుడు మరో హాట్ కామెంట్ చేశాడు. ఎప్పుడు లేనివిధంగా కొరటాల సినిమా ప్రారంభోత్సవం రోజే ఈ స్థాయి చెప్పడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి.

100కోట్ల బడ్జెట్ :

100కోట్ల బడ్జెట్ :

జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 100కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా లాంచింగ్ డేట్ సైతం చెప్పేయతం తో అంతా ఒక్కసారి విస్మయానికి గురయ్యారు.

నవంబర్ 9న:

నవంబర్ 9న:

హైదరాబాద్‌లో నవంబర్ 9న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు మూవీ యూనిట్ వర్గాలు ప్రకటించాయి. శ్రీమంతుడు సినిమాతోనే తమ కాంబినేషన్‌పై భారీ అంచనాల్ని ఏర్పడేలా చేసిన కొరటాల... ఈసారి మరింత బ్రహ్మాండమైన కథ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

English summary
The news is that the makers of the film "Bharat Anu Neanu" have decided to release the movie on September 22nd. This is a huge move and credit should go to Koratala Shiva for his detailed planning and execution.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu