»   » మహేష్ బాబు-కొరటాల మూవీ టైటిల్.... ఏమిటో తెలుసా?

మహేష్ బాబు-కొరటాల మూవీ టైటిల్.... ఏమిటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో మరో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఇదే టైటిల్ తో సినిమా వస్తుందని భావిస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

పొలిటికల్ డ్రామాగా, సోషల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని అంటున్నారు.

సీఎంగా

సీఎంగా

మహేష్ బాబు తొలిసారిగా తెరపై సీఎంగా కనిపించబోతున్నాడనే వార్త వినగానే.... అసలు కథ ఏ రేంజిలో ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొరటాల శివ ఏ స్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

కొత్తగా

కొత్తగా

శ్రీమంతుడు సినిమాలో అదిరిపోయే సామాజిక అంశంతో మహేష్ బాబు అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిన కొరటాల శివ.... ఈ సారి రాజకీయాలకు సంబంధించిన అంశంతో డిఫరెంటుగా ట్రై చేస్తున్నారని టాక్.

శ్రీమంతుడు మించేలా

శ్రీమంతుడు మించేలా

శ్రీమంతుడు సినిమాలో... ఊరికి ఉంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్టు హైలెట్ అయినట్లే, ఇందులోనూ అలాంటి ఒక హైలెట్ అయ్యే ఎలిమెంటును కొరటాల శివ చూపించబోతున్నారని, ఈ సినిమాపై మహేష్ బాబు ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారని, తన కెరీర్లో శ్రీమంతుడును మించిన హిట్ ఈసినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారని అంటున్నారు.

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి)

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Mahesh's next film with Koratala Siva has officially registered a title. Bharat Ane Nenu is going to be the title of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu