»   » బావ పై ప్రేమతో... మహేష్ బాబు ట్వీట్

బావ పై ప్రేమతో... మహేష్ బాబు ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుధీర్ బాబు-నందిత జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' . మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి మహేష్ బాబు ట్వీట్ చేసాడు. ఆయన ఏం చేసాడో మీకూ చూడాలని ఉందా..ఇదిగో చూడండి..


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఇక చిత్రానికి.. రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందంటున్నారు నిర్మాతలు శిరీష, శ్రీధర్. గతవారం విడుదలైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో.. మరో 24 థియేటర్స్ ని పెంచారట.


ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన పోసాని కృష్ణ మురళి... సినిమా సక్సెస్ పట్ల తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఒక రచయితగా తన మనసుకు నచ్చిన కథ ఇదంటూ.. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాకు కితాబిచ్చారు పోసాని.


మహిళా ప్రేక్షకులు అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇదన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సినిమాలో తాను పోషించిన ప్రిన్సిపాల్ పాత్ర తనను తిరిగి తన కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లిందని.. విద్యార్థులను సరైన త్రోవలో నడిపించేవిధంగా ఆ పాత్రను దర్శకుడు మలచాడన్నారు పోసాని. తాను పోషించిన పాత్ర నిడివి తక్కువే అయినా.. విమర్శకుల ప్రశంసలందుకుంటోందని... ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.


Mahesh lauds Krishnamma Kalipindi Iddarini

చిత్రం కథేమిటంటే...


కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కథలో .... యుస్ ఎ లో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురం(ఇలాంటి పేర్లు మన సినిమాల్లో ఈ మధ్యన ఎవరూ పెట్టడం లేదు...మళ్లీ గుర్తు చేసారు ఆ రోజులని ) కి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు తన గతం గుర్తు వస్తుంది.


తను ఎదుగదలకు కారణమై...తను ఎంతగానో ఇష్టపడ్డ రాధ (నందిత) చుట్టూ తిరుగుతుంది. లోయిర్ క్లాస్ లో పుట్టి ఆర్దికంగా ఇబ్బందులు పడుతూ ఏడవ తరగతి కూడా పాస్ కాలేని...తను ఇంజినీరు గా మారి ఆర్దికంగా ఉన్నత స్దాయికి ఎలా ఎదిగాడు..అందుకు ఆమె ప్రేమ ఎలా స్పూర్తిగా నిలిచింది. ఆమె ప్రేమను వ్యక్తం చేసే ప్రతీ సారి అతను పడే ఇబ్బందులు ఏమిటి...చివరకు... అతను ఆమె ప్రేమను పొందాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


English summary
Krishnamma Kalipindi Iddarini was lauded by none other than Superstar Mahesh Babu."Saw Krishnamma kalipindi idharini.. Genuine honest love story ..enjoyed watching it ..Sudheer has really come of age as an actor .. Loved his performance :) congrats to the entire team .." (sic), Mahesh Babu wrote on his twitter page.
Please Wait while comments are loading...