For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ అంతా ప్రిన్స్ మేనియా..దుమ్మురేపుతాడు..!

  By Sindhu
  |

  ఇప్పుడు టాలీవుడ్ లోఅంతా ప్రిన్స్ మేనియా నడుస్తోంది. ఖలేజా తర్వాత ధూంధాం చేయడానికి మహేష్ దూకుడుగా వస్తున్నాడు. ప్రిన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఈ మూవీ ఆడియో రిలీజ్ కు ముహూర్తం దగ్గరపడింది. ఈ గురవారం సాయంత్రమే సూపర్ స్టార్..సూపర్ సాంగ్స్ తో దుమ్మురేపనున్నాడు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళతా... భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది... ఇవి దూకుడులో ప్రిన్స్ నోట వచ్చే పవర్ పుల్ డైలాగ్స్. ఇవి జస్ట్ షాంపిల్ మాత్రమే. ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయంటోంది.. సినిమా యూనిట్.

  క్రిస్ప్ గా ఉండే పంచ్ డైలాగ్స్, కేక పుట్టించే మ్యూజిక్, స్టెప్పులేయించే డ్యాన్స్...ఇవి మహేష్ మూవీకి ఉండాల్సిన ప్రాథమిక సూత్రాలు. మసాలా స్టోరీకి ఎంటర్ టైన్ మెంట్ ను జోడించి.. సక్సెస్ కొట్టే శ్రీనువైట్ల ఈ సినిమాకు దర్శకుడు. మచ్చుకు ఈ ప్రోమో చూడండి..సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు.. అటు ఫ్యాన్స్ లోనూ, ఫిల్మ్ నగర్ లో నూ ఒకటే చర్చ. పాటలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ. ఇంట్రడక్షన్ సాంగ్ ను సరికొత్తగా చూపించడంలో ప్రిన్స్ తర్వాతే ఎవరైనా. రాజకుమారుడు నుంచి ఖలేజా వరకు...హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ సాగే పాటలు...ఆయన అభిమానులను ఉర్రూతలూగించాయి. మహేష్ సినిమాలకు మ్యాగ్జిమమ్ మణిశర్మే మ్యూజిక్ డైరెక్టర్. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. అయితే పోకిరి తర్వాత.. ఈ జోడి ఫ్లాపులబాట పట్టింది. ఈ సారి జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ మహేష్ లేటెస్ట్ సెన్సేషన్ థమన్ ను తన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. స్టార్ హీరోలకు తనదైన స్టైల్లో మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతుతున్నడీ ఈ యువ కెరటం. దూకుడులో మహేష్- థమన్ కలిసి చేసిన మ్యాజిక్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు సినీజనం.

  డైరెక్టర్ శ్రీనువైట్లకు ఒక సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఆయన సినిమాల్లో ఓ ఫోక్ సాంగ్ కంపల్సరీ ఉంటుంది. దూకుడులోనూ ఓ మాస్ సాంగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కూడా అప్పుడెప్పుడో బాబీ మూవీలో ఓ ఫోక్ సాంగ్ లో ఇరగదీశాడు. మళ్లీ అటువంటి పాట కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి దూకుడులో ఆ పాట ఏ రేంజ్ లో ఉంటుందో మరి. మహేష్ తో జతకట్టిన హీరోయిన్ జాతకం మారిపోతుందనేది ఫిల్మ్ నగర్ సెంటిమెంట్. ప్రిన్స్ తో స్టెప్పులేస్తే... అప్ కమింగ్ తారలు టాప్ లో దూసుకుపోతారు. మరి మూడో సినిమానే మహేష్ బాబుతో జతకట్టిన సమంత..స్టార్ డమ్ ఏ రేంజ్ లో వెలుగుతుందో వెయిట్ అండ్ సీ.. ఎన్నో విశేషాలు, మరెన్నో అంచనాలున్న దూకుడు ఆడియో లాంచింగ్ ఈ గురువారం సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరగనుంది.

  English summary
  Mahesh Babu latest film Dookudu almost completed the shoot accept a couple of songs and patch work. The patch work is being shot currently and soon a family song would be filmed from August 18th. Mean while the post production works are also running quickly. Dookudu audio will be launched on August 18. Mahesh Babu said that Dookudu audio is one of his best so far.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X