»   »  మే నెలంతా సాగనున్న బ్రహ్మోత్సవం

మే నెలంతా సాగనున్న బ్రహ్మోత్సవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా పబ్లిసిటీ లేదంతే చతికిల పడ్డట్టే. ప్రచారం అనేది సినిమాకి ప్రాణం లాంటిది. ఈ విషయం లో మాత్ర టాలీవుడ్ లో అప్డేట్ గా ఉన్నది మహేష్ బాబు మాత్రమే. తన ప్రాజెక్ట్ కి ప్రచారం కల్పించటం లో ఎప్పుడూ ముందుంటాడు మహేష్.

మహేష్ కొత్త సినిమా బ్రహ్మోత్సవం ఇంకా ఆదియో ఫంక్షన్ కూడా జరగకుండానే మే నెలలో విడుదల చేయటం ఖాయం అంటున్నారు. అందుకే మే 1నుంచే బ్రహ్మోత్సవం ప్రచార జోరు మొదలైపోనుంది. ఇక అన్ని టీవీ ఛానల్స్ లో ప్రమోషన్స్ 'మధురం మధురం' అనే పాటని విపరీతంగా వాడనున్నారట..

వెబ్ సైట్స్ లో ల్యాండింగ్ పేజ్ ను బ్రహ్మోత్సవం యాడ్స్ తో నింపేయడం తో పాటు.. రకరకాల ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రచారం చేయటం కూడా కొత్తగా ఉంటుందా అని ఆశ్చర్య పోయేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట.

 Mahesh Plans Huge for Brahmotsavam

మహేష్ తన సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రచారం గతంలో శ్రీమంతుడు విషయంలో చూశాం కానీ.. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరింత దూకుడు చూపించబోతున్నాడని తెలుస్తోంది.

ఈ నెల 7న బ్రహ్మోత్సవం ఆడియో విడుదల కానుండగా.. ఇప్పటికైతే 27నే బ్రహ్మోత్సవం మూవీని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అంటే.. మే 1నుంచి చూస్తే దాదాపు నాలుగు వారాలు పబ్లిసిటీ కోసం కేటాయించనున్నారన్న మాట. ఓ తెలుగు సినిమాకి ఇదే హైయెస్ట్ పబ్లిసిటీ ప్లానింగ్ అవనుంది...

English summary
Even before the audio albums are out, the team of 'Brahmotsavam' has begun its promotional campaign
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu