»   » ‘1 నేనొక్కడినే’ పంక్షన్ లో ఎవరేమన్నారు?(ఫొటో ఫీచర్)

‘1 నేనొక్కడినే’ పంక్షన్ లో ఎవరేమన్నారు?(ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్‌గా '1' షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్‌లో ఎక్కడో చిన్న మార్పు జరిగింది. 'అప్పుడు నువ్వు ఈ కథ ఇలా చెప్పలేదే'అని అడిగారు. ఆయనలోని జ్ఞాపకశక్తి చూసి అనిపించింది ఎస్.. హీఈజ్ '1' అని. మహేష్‌కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ '1' అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్. ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ '1' అని. నిజంగా నేను లక్కీ. ఎలాగంటే... ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గౌతమ్... అని సుకుమార్ అన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం '1'. 'నేనొక్కడినే' అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, శ్రేయాభిలాషలు, మహేష్ తో చిత్రాలు తీసిన, తీయబోయే దర్శక,నిర్మాతలు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో ఈ పంక్షన్ ఘనంగా జరిగింది.

మహేష్ గురించి ఆడియో పంక్షన్ లో ఎవరేమన్నారనేది..స్లైడ్ షో లో...

కృష్ణ మాట్లాడుతూ ...

కృష్ణ మాట్లాడుతూ ...

''ఏదైనా సినిమా విడుదలయ్యాక రికార్డులు సృష్టిస్తుంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. పరిశ్రమలో మంచి బిజినెస్‌ చేసి నంబర్‌వన్‌గా నిలిచింది. ఏడాదిపాటు మహేష్‌ పడ్డ కష్టం, సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. సినిమా విడుదలయ్యాక కూడా ఇదేస్థాయిలో మరిన్ని రికార్డుల్ని సాధించి పరిశ్రమలో నంబర్‌వన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

గౌతమ్‌కి కూడా...

గౌతమ్‌కి కూడా...

''ఈ సినిమాను ఇంత కష్టపడి చక్కగా తీసిన బృందానికి నా అభినందనలు. మహేష్‌ తొలిసారిగా వెండితెరపై కనిపించిన వయసులోనే ఇప్పుడు గౌతమ్‌ కూడా పరిచయమవుతున్నాడు. నన్ను, మహేష్‌ని ఆదరించినట్లే గౌతమ్‌కి కూడా మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తున్నాను'' అని కృష్ణ అన్నారు.

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ....

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ....

''నువ్వు మహేష్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలి అని అతనితో పని చేసిన వారు నాకు చెప్పేవారు. అలా ఎందుకన్నారో ఇప్పుడు తెలిసింది. అతను ఓ అద్భుతం... ఇదే మహేష్‌ గురించి నేను చెప్పే మాట'' అన్నారు. ''ఈ సినిమా చిత్రీకరణకి రెండేళ్లు పట్టింది అంటే దానికి కారణం నేను కాదు ఆయనే. ఎందుకంటే చిత్రీకరణ పూర్తయిపోతే ఆయన్ని చూడటం కుదరదు కదా! అందుకే ఆయన్ను చూస్తూనే ఉండాలని ఇన్నాళ్లు చిత్రీకరణ చేశాను. మహేష్‌ అంటేనే వైవిధ్యం. అలాంటి వ్యక్తిని మరింత కొత్తగా చూపిస్తున్నాం. అదెలాగనేది సినిమా చూస్తే అర్థమవుతుంది''అని సుకుమార్ అన్నారు.

సుకుమార్ కంటిన్యూ చేస్తూ...

సుకుమార్ కంటిన్యూ చేస్తూ...

దేవిశ్రీప్రసాద్ తో నాది 5వ సినిమా. సుకుమార్ ది నాది ఎమోషనల్ అటాచ్ మెంట్ ఇద్దరి మనస్థత్వాలు ఒకటే కాబట్టి ఇన్ని సినిమాలు చేశాము. ఈ సినిమాకు ఇంత కలర్ ఉందంటే దానికి ఛాయాగ్రహకుడు రత్నవేలు గారే కారణం. ఆయన మహేష్ ని ప్రేమించాడు. ఆయన మీదే పూర్తిగా మనసు పెట్టాడు. పీటర్ హైన్ మంచి యాక్షన్ సీక్వన్సెస్ ఇచ్చాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు. ముగ్గురు నిర్మాతలతో చేయడం ఆనందంగా ఉంది. హీరోయిన్ కు మొదటి సినిమా అయినా తెలుగు నేర్చుకుంది. ఆ అమ్మాయి వచ్చినపుడు ఇంజనీరింగ్ పర్సంటేజ్ ఎంత అడిగిన వెంటనే తీసుకున్నాను. మహేష్ బాబు ఇందులో వైవిధ్యంగా కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహేష్ బాబు తొలి సినిమా లాంటిది. ఆ విధంగా ఆయన పని చేశాడు. చిత్ర టైటిల్ అర్థం నేను అలోన్ అని. ఆయనకు కాఫీ షాప్ లో కథ చెప్పాను. రెండు సంవత్సరాల తరువాత కూడా ఆయన గుర్తు పెట్టుకున్నారు. డీప్ సీలో షూట్ చేస్తున్నాము. ఆ సమయంలో ప్రొఫిషనల్ ఈతగాళ్ళు ఉన్న సమయంలో మహేష్ బాబుకు ఈత రాకున్నా చాలా స్సీడ్ గా బోట్ డ్రైవ్ చేశాడు. మహేష్ బాబు 360 డిగ్రీలలో అందగాడు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మరో లిటిల్ సూపర్ స్టార్ ను తెరకు పరిచయం చేసిన ఘనత కూడా నాకే దక్కింది. ఆ కుర్రాడు ఇలా చెప్పగానే అలా అల్లుకు పోయాడు. అతను ఈ సినిమాకు ఒక అస్సెట్ ఈ సినిమాలో తండ్రి కొడుకులను ఇద్దరినీ చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది అన్నారు.

దేవిశ్రీ మాట్లాడుతూ....

దేవిశ్రీ మాట్లాడుతూ....

''మహేష్‌తో గతంలో రెండు సార్లు పని చేసే అవకాశం వచ్చినా కుదర్లేదు. ఇప్పటికి సాధ్యమైంది. అతనితో పనిచేయాలనే ఇన్నాళ్ల కోరిక ప్రభావం ఈ సినిమా పాటల్లో కనిపిస్తుంది. సుకుమార్‌, మహేష్‌బాబు శక్తికి నా శక్తిని కలిపి సినిమాకి సంగీతాన్ని అందించాను.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ

బోయపాటి శ్రీను మాట్లాడుతూ

మహేష్ బాబు అభిమానులైనందుకు గర్వ పడాలి. మహేష్ బాబు ఈ కాన్సెప్ట్ మీకోసం ప్ర వేశ పెట్టారు. ఈ వన్ ఆల్ఇన్ వన్. దర్శకుడు నాకు మంచి మిత్రుడు సోదరుడి లాంటి వాడు. హీరోను డిఫరెంట్ గా చూపించాలని అనుకుంటాడు. తెలుగు సినిమా అభిమానులందరికి సంక్రాంతికి తెలుగు సినిమా పండుగ లా ఉండాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసిన తరువాత నాకు ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. ఆ సమయంలో మహేష్ బాబు గారు నాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ వద్ద నేను దర్శకత్వ శాఖలో పని చేశాను.

 హీరోయిన్ కృతి సనన్ మాట్లాడతూ .....

హీరోయిన్ కృతి సనన్ మాట్లాడతూ .....

ఈ సినిమాలో నటించడం నా లక్ అన్నారు.ఇది ఒక మంచి ఎక్స్ పీరియన్స్ మహేష్ బాబు లాంటి హీరోతో పని చేయాలని అమ్మాయిలందరూ కల కంటారు ఆ అదృష్టం నాకు కలిగింది. నిర్మాతలు చాలా బాగా చూసుకున్నారు అన్నారు.

 శ్రీనువైట్ల మాట్లాడుతూ

శ్రీనువైట్ల మాట్లాడుతూ

రామ్, గోపి, అనిల్ లకు సినిమా అంటే ప్యాషన్. వారితో నేను దూకుడు చేశాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తారు. వారు తమ తొలి సినిమా నుండి ప్రమోషన్ చాలా బాగా చేస్తారు. సుకుమార్ కి ఒక స్టైల్ ఉంది. అతని సినిమాల్లో అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కు ఒక అంచనా క్రియేట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని ఇస్తాడు. మహేష్ బాబు గురించి చెప్పవలసి వస్తే ఆయనకు సహనం అనే వజ్రాయుధం ఉంది. అదే గొప్ప సినిమాలు రావడానికి కారణం అవుతోంది.ఆయన సెట్ లో ఒక స్టూడెంట్ లాగా ఉంటాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయి రికార్డులు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అభిమానులే 'ఆడియో ఆవిష్కర్త'లు ....

అభిమానులే 'ఆడియో ఆవిష్కర్త'లు ....

ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో అభిమానులు చేసిన సందడికి... హీరోసహా మొత్తం చిత్ర యూనిట్ ప్రేక్షకులయ్యారు. మహేష్ హీరోగా నటించిన '1 నేనొక్కడినే' ఆడియో వేడుక ఇలా వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కొత్తగా ఉంది...

కొత్తగా ఉంది...


గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. విశాఖపట్నం, వరంగల్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రిలోని అభిమానులు వరుసగా ఈ సినిమాలోని పాటలను ఆవిష్కరించారు. అంతేకాదు... ఒక్కో ప్రాంతం నుంచి పాటలను విడుదల చేసిన అభిమానులు మహేష్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ను ఉద్దేశించి ప్రశ్నలు అడిగారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను మీడియా పార్ట్‌నర్‌గా ఉన్న 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులే స్వయంగా పాటలు ఆవిష్కరించే ప్రక్రియ కొత్తగా ఉందని, ఎంతో ఆనందం కలిగించిందని మహేష్ పేర్కొన్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ...

మహేష్ బాబు మాట్లాడుతూ...

దూకుడు తరువాత వారితో పని చేయడం ఆనందంగా ఉంది. వాళ్ళు నా ఫేవరేట్ ప్రొడ్యూసర్స్.తరువాత సినిమా ఆగడు కూడా వారితో చేస్తాను. వారితో పని చేయడం సొంత వాళ్ళతో పని చేసినంత ఆనందంగా ఉంది.వాళ్ళు ఖర్చకు వెనకాడ కుండా చేశారు. ఆనందమైన రోజు ఈ రోజు కోసం ఎదురు చూశాము. ఈ సందర్భంగా దేవికి థాంక్స్ చెప్పాలి. నేను దేవి చాలా సార్లు కలిశాము. సినిమా చేయాలనుకున్నాము ఎందుకో కుదరలేదు. సుకుమార్ కాంబినేషన్ లో చేయడం ఆనందంగా ఉంది. మా దర్శకుడు సుకుమార్ వన్ స్టోరి సినిమా బాగా తీశాడు. నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుంది.

మూడేళ్ళు సినిమా కోసం కష్టపడ్డాడు.అలాగే పీటర్ హెయిన్స్ బ్లడ్ పెట్టి పని చేశాడు. నన్ను ఓ బిల్డింగ్ నుండి నన్ను దూకించాడు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సినిమాకు సింగిల్ కార్డు. ఈ సినిమాలో నాతో డాన్స్ చేయించారు. అది మీకు నచ్చుతుంది అనుకుంటాను. చంద్రబోస్ గారు మంచి సాహిత్యాన్ని అందించారు. మా అబ్బాయి గౌతం కు తొలి సినిమా వాడు నాకంటే బాగా చేశాను అనుకుంటాడు. వాడిని పరిచయం చేసినందుకు సుకుమార్ కు థాంక్స్ చెప్పాలి. రత్నవేల్ గారు చాలా చక్కగా చూపించాడు. రెండు సంవత్సరాలుగా మాతోనే ఉండి పని చేశారు. మా హీరోయిన్ కృతి కి తొలి సినిమా అయినా కూడా చాలా అనుభవమున్న దానిలాగా చేసింది. నన్ను ఎంతో అభిమానిస్తున్న మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. మేము చేయాల్సింది అంతా చేశాము మిగతాది మీరు చూసుకోవాలి జనవరి 10 న పండుగ బాగా చేసుకుందాము అన్నారు.

English summary
Mahesh Babu starrer 1 Nenokkadine's audio was launched yesterday (19 December 2013) in a novel way. The main audio event took place at Shilpa Kala Vedika in Hyderabad. What's new is that the audio launch was telecasted in some of the movie theatres…LIVE! This has happened for the first time in Tollywood. The event was also shown on television live.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu