»   » 'బ్రహ్మోత్సవం' : లాంచ్, రిలీజ్ డేట్

'బ్రహ్మోత్సవం' : లాంచ్, రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదర్బంగా మహేష్ కొద్ది రోజులు పాటు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఎప్పటిదాకా అంటే కొద్ది రోజులు మాత్రమే. ఆ వెంటనే 'బ్రహ్మోత్సవం' మొదలెట్టేస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆగస్టు 18న లాంచ్ అవనుంది. అలాగే...మార్చి 25 న విడుదల తేదీని ఖరారు చేసారు. ఈ గ్యాప్ లో ఎబ్రాడ్ వెళ్లటానికి మహేష్ ప్లాన్ చేసారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉందీ చిత్రం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయటంతో అభిమానులు ఆనందోత్సాహాలల్లో నిమగ్నమయ్యారు.

Mahesh 's Brahmotsavam:Launch And Release Dates

గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

శ్రీమంతుడు చిత్రం విషయానికి వస్తే....

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ ఓపెనింగ్స్ ఇరగ దీసింది. వరల్డ్ వైడ్ భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లో కలిపి తొలిరోజు రూ. 30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఒక్క వెస్ట్ గోదావరి లోనే ఈ మూవీ ఫస్ట్ డే 1.70 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా నటించడం, ‘మిర్చి' ఫేం కొరటల శివ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై మొదటి నుండీ మంచి భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ రిలీజైన తర్వాత అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా విడుదల ముందు మహేష్ బాబు ప్రమోషన్ల విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.

అన్ని ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈవన్నీ సినిమాకు బాగా ప్లస్సయ్యాయి. అందరూ ఊహించిన విధంగానే ‘శ్రీమంతుడు' విడుదలైన ఫస్ట్ షోకే పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. సొంతూరుకు ఏదైనా చేయాలనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాకు ఫిదా అయిపోయారు. సినిమాలో మహేష్ బాబు స్మార్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.

ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
On August 18th, Mahesh's next film "Brahmotsavam" under Srikanth Addala's direction will be launched.The makers are aiming for a 25th March 2016 release date for the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu