»   »  ‘బ్రహ్మోత్సవం’ ..బయిటపడాలంటే 76 కోట్లు, ఆ తర్వాతే మిగతా లెక్కలు

‘బ్రహ్మోత్సవం’ ..బయిటపడాలంటే 76 కోట్లు, ఆ తర్వాతే మిగతా లెక్కలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రోజులు మారాయి. ఓ సినిమాకు ఎంత బిజినెస్ జరిగితే అంత రిస్క్ పెరుగుతున్నట్లే. ముఖ్యంగా భారీ సినిమాలకు బిజినెస్ పెరిగిందనే ఆనందంతో పాటు, జరిగిన బిజినెస్ ఫిగర్ ని రీచ్ అవ్వాలనే టార్గెట్ పొంచి ఉంటోంది. ముఖ్యంగా మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ భారీ డిజాస్టర్ ఇండస్ట్ర్రీ పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఓ పెద్ద సినిమాకు ఎక్కువ బిజినెస్ జరిగితే సంతోషపడే ట్రేడ్ వర్గాలు ఇప్పుడు టెన్షన్ తో భాక్సాఫీస్ వైపు చూస్తున్నాయి.

అదే కోవలో బ్రహ్మోత్సవం చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు అందుతున్న సమాచారం ప్రకారం అన్న ఏరియాలు కలిపి 73 కోట్లు వరకూ బిజినెస్ అయ్యింది. దానికి ప్రింట్స్, ఖర్చులు పబ్లిసిటీ కలిపి మరో మూడు కోట్లు కలుపుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్త రిలీజ్, అదీ ఎక్కువ సెంటర్లలో కాబట్టి. దాంతో ఈ సినిమా 76 కోట్లు తెచ్చుకుంటేనే ముందు సేఫ్ అవుతుందని తేలింది.

ఎన్ని రోజుల్లో గ్రాస్ కాకుండా షేర్ 76 కోట్లు వస్తుంది, దాన్ని బట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంచనా వేస్తారు. ఆతర్వాత నుంచి లాభాలు లెక్కల్లోకి వస్తాయి. బ్రహ్మోత్సవం తొలి రోజు, రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ కీలకం కానున్నాయి.

Mahesh's Brahmotsavam needs 76 cr to save!!

తొలి రోజు ఐదు షోలు, మిగతా రెండు రోజులు వీకెండ్ కావటం సినిమాకు బాగా కలిసి వచ్చే అంశం. ఫ్యామిలీలు ఎక్కువగా ఈ సినిమాకు వెళ్ళే అవకాసం ఉంది కాబట్టి..ఈ అంకెను ఈజీగా చాలా తక్కువ సమయంలో బ్రహ్మోత్సవం క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఓవర్ సీస్‌లో మహేశ్‌కు ఫుల్ క్రేజ్ ఉండటంతో 'బ్రహ్మోత్సవం' రైట్స్ కోసం అక్కడి బయ్యర్లు తెగ పోటిపడ్డారట. పైగా మే 19 అర్ధరాత్రికే ప్రీమియర్ షోస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో మహేశ్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కలెక్షన్స్ విషయంలో కూడా ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా నిలిచింది. ఇదే రీతిన బ్రహ్మోత్సవంకు కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లు వస్తాయని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. అందుకోసం ఈ చిత్రాన్ని అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, ఎం.బి.ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పెరల్‌.వి.పొట్లూరి, పరమ్‌.వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు.

English summary
"Brahmotsavam" needs to collect nearly 76+ crore to save its distributors.
Please Wait while comments are loading...