మహేష్‌ని చిన్న పాప సైతం పెళ్లి చేసుకోమని అడుగుతోంది

By Srikanya

హైదరాబాద్‌: మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రహ్మాత్సవం' . ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది టీమ్. అందులో భాగంగా...సాంగ్ టీజర్ ని విడుదల చేసారు.

'బ్రహ్మోత్సవం' చిత్రంలోని మధురం మధురం.. అనే పాట టీజర్‌ విడుదలైంది. చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఈ టీజర్‌లో మహేష్‌బాబు అందం చూసిన ఓ చిన్నపాప నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు చిత్రీకరించారు. అంతేకాదు మహేష్‌ అలా నడిచి వస్తుంటే అటువైపు ఉన్న అమ్మాయిలు సైతం ఆయన్నే చూస్తున్నారు.

సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X