»   » మహేష్ 'బ్రహ్మోత్సవం' : సంగీత్ సాంగ్ వర్కింగ్ స్టిల్ (ఫొటో)

మహేష్ 'బ్రహ్మోత్సవం' : సంగీత్ సాంగ్ వర్కింగ్ స్టిల్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. రాజు సుందరం మాస్టర్‌ నేతృత్వంలో సంగీత్‌ పాటను మహేష్‌బాబు, ప్రణీత, నరేష్‌, రావు రమేష్‌, జయసుధ, తులసి... ఇలా 21 మంది నటులపై తెరకెక్కిస్తున్నారు. ఈ సాంగ్ వర్కింగ్ స్టిల్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

సాంగ్ సిట్యూవేషన్


అక్కడ అంతా ఒకటే సందడిగా ఉంది. ఇల్లంతా పూలసోయగాలతో పరిమళిస్తోంది. లంగా ఓణీలు కట్టిన పడుచులతో మెరిసిపోతోంది. ముత్తయిదువులు పట్టుచీరలు కట్టుకుని చేసే హడావిడికి లెక్కే లేదు. మరో పక్క సంగీతం జోరుగా వినిపిస్తోంది. కుటుంబం, బంధువులు...ఇలా అందరూ కలిసి సరదాగా ఓ పాటేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి మహేష్‌బాబు స్టెప్పులేస్తున్నాడు. ఎందుకంటే 'బ్రహ్మోత్సవం' కోసం.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Mahesh 's Brahmotsavam: Song Working Still!

మహేష్‌బాబు మాట్లాడుతూ ''శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథ బాగా నచ్చింది. 'శ్రీమంతుడు' తర్వాత ఇంత మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు నా అభిమానుల్ని అలరించే చక్కటి కుటుంబ కథా చిత్రమవుతుంద''న్నారు.


''సంగీత్‌ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ వేడుకలు ఇలానే కొనసాగుతాయ''న్నారు దర్శకుడు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ ''తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజునే మా చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. తోట తరణి వేసిన భారీ సెట్‌లో ఈ పాటను తెరకెక్కిస్తున్నాం. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు


మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉందీ చిత్రం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయటంతో అభిమానులు ఆనందోత్సాహాలల్లో నిమగ్నమయ్యారు.


గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, సంగీతం: మిక్కీ.జె. మేయర్‌

English summary
Srikanth Addala began 'Brahmotsavam' shooting with a Song which is currently picturized at the Ramoji Film City. Mahesh Babu has joined the shoot and in the picture we could see the Superstar trying to repeat what the Choreographer has shown him.
Please Wait while comments are loading...