»   » ఎడ్రస్ ఇచ్చిపో, నా బీరకాయ చుట్టం: మహేష్ (వీడియో)

ఎడ్రస్ ఇచ్చిపో, నా బీరకాయ చుట్టం: మహేష్ (వీడియో)

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేశ్‌బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్ర ఆడియో వేడుక కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మహేష్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

mahesh

ఇక ఈ పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరూ అంటే...మహేశ్‌ కుమార్తె సితార ప్రత్యేక అనే చెప్పాలి. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రావు రమేష్‌, రేవతి, సత్యరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీతలు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇక ఈ ఆడియో విడుదల సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉండి, ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సమ్మర్ కు ఖచ్చితంగా హిట్ కొట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది.


సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

English summary
Brahmotsavam Telugu movie Theatrical Trailer starring Mahesh Babu, Samantha, Kajal Aggarwal and Pranitha Subhash. Brahmotsavam Telugu movie is directed by Srikanth Addala and music by Mickey J Meyer. Produced by Prasad V Potluri under the PVP Cinema banner and G. Mahesh Babu Entertainment Pvt. Ltd.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu