»   » పోలీసులకి దొరికిన ‘బ్రహ్మోత్సవం’ వీడియో గ్రాఫర్లు

పోలీసులకి దొరికిన ‘బ్రహ్మోత్సవం’ వీడియో గ్రాఫర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల: మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. . ఈ చిత్రం వీడియో గ్రాఫర్స్ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన తిరుమలలో జరిగింది. రథసప్తమి పర్వదినంలో భాగంగా శ్రీవారి గరుడ సేవలను చిత్రీకరిస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంఘటన వివరాల్లోకి వెళితే... లేటెట్స్ టెక్నాలిజీ కెమెరాలతో తిరువీధుల్లో అనుమతి లేకుండా వీడియో చిత్రీకరణపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వీడియో గ్రాఫర్లను అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం వారిని విచారించగా బ్రహ్మోత్సవం చిత్రం కోసం వీడియోలను షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వారి వద్ద అనుమతి పత్రాలు ఏమీ లేవు. దాంతో అనుమతి లేకుండా వీడియోలు ఎలా చిత్రీకరిస్తారని పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


 Mahesh's ‘Brahmotsavam’ Videographers arrest

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇదే అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఆ వివరాల ప్రకారం....‘సత్యరాజ్, రేవతి ఈ చిత్రంలో మహేష్ బాబు తల్లిదండ్రుల పాత్రలో కనిపించనున్నారు.


ఇదో ఫ్యామిలీ స్టోరీ. తండ్రి(సత్యరాజ్), కొడుకు(మహేష్ బాబు) మధ్య బంధాన్ని ఈచిత్రంలో అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నారట. తల్లి(రేవతి) కుటుంబానికి సంబంధించిన అంశాలు సినిమాలో కీలకం. ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ విలువల గురించి హీరో ఎలా రియలైజ్ అయ్యాడు అనేది మెయిన్ కాన్సెప్టని అంటున్నారు.

English summary
Police arrested Mahesh's ‘Brahmotsavam’ Video Graphers at Tirumala. Latest update of ‘Brahmotsavam’ is gearing up for release in the month of April, this year. Samantha, Kajal and Pranitha have romanced with Mahesh in the movie. The movie is being directed by Srikanth Addala on PVP Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu