రజనీ 'రోబో' కు దారిఇస్తూ...మహేష్ 'ఖలేజా' తప్పుకుంది
మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజాని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయాలని మొదట నిర్ణయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా రిలీజ్ తేదీ మారింది. అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ చేయటానికి నిర్ణయించారు. ఎందుకంటే రోబో చిత్రం అక్టోబర్ 1న ప్రపంచమంతటా విడుదల అవుతోంది. దాంతో మహేష్ బాబు చిత్రాన్ని రిలీజ్ తేది మార్చారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అఅనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ రచన చేసి దర్శకత్వం వహించారు. రోబో రిలీజ్ తో ధియోటర్స్ భారీగా బుక్ చేయటం, అలాగే రజనీకాంత్ హవాతో మినిమం వారం అయినా జనం ఆ చిత్రం తప్ప వేరేది ఆలోచించరనే నిర్ధారించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదైమైనా సిని అభిమానులకు మాత్రం వారం తేడాలో రెండు పెద్ద చిత్రాలును చూడచ్చు.
మహేష్ బాబు ఖలేజా అనుష్క మణిశర్మ రోబో రజనీకాంత్ శంకర్ robo khaleja mahesh babu trivikram rajinikanth shankar anushka


Click it and Unblock the Notifications