»   » జూన్ 1 నుంచి మహేష్ కొత్త చిత్రం...వివరాలు

జూన్ 1 నుంచి మహేష్ కొత్త చిత్రం...వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివతో చిత్రం చేస్తున్న మహేష్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకున్నారు. విశ్వసనీయంగా అందుుతున్న సమాచారాన్ని బట్టి మహేశ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించే భారీ చిత్రం షూటింగ్‌ జూన్‌ ఒకటిన ప్రారంభం కానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేశ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా ఇది. అలాగే మహేశ్‌తో అశ్వనీదత్‌ నిర్మించే మూడో సినిమా కూడా ఇదే. ‘చిరుత' సినిమా తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్‌ వైజయంతీ సంస్థకు పనిచేస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

Mahesh's new movie from June 1st

మహేశ్‌ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. ఏప్రిల్‌లో పాట రికార్డింగ్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్‌ సంగీతదర్శకత్వం వహించనున్నారు.జిబ్రాన్‌ ఇంతకు ముందు తెలుగులో రన్ రాజా రన్ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

మహేష్ తాజా చిత్రం విషయానికి వస్తే....

మహేష్‌బాబు కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెర కెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యర్నేని నవీన్‌, వై.రవిశంకర్‌, మోహన్‌ సి.ఎం.ఆర్‌ నిర్మాతలు. ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఓ పాటతో పాటు, కుటుంబ నేపథ్యంలో సాగే పలు సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

Mahesh's new movie from June 1st

తమిళనాడులోని కారైకూడిలోనూ చిత్రీకరణ జరుపనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ''మహేష్‌బాబు శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, వినోదం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యముంది. ఇందులో మహేష్‌కు తల్లిగా సుకన్య నటించారు. ప్రస్తుతం జరుగుతున్న భారీ షెడ్యూల్‌తో సినిమా తుది దశకు చేరుకొంటుంది.

'మిర్చి' తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంద''ని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం, సంపత్‌రాజ్‌, తులసి, సితార తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

English summary
Mahesh, puri Jagannath new movie will start from June 1st. Now Mahesh is busy with Koratala Siva's movie.
Please Wait while comments are loading...