twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు' : టిక్కెట్ రేట్లు పెంచేసారు..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రేట్లు పెంచమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఫర్మిషన్ ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, రాజమండ్రి, ఏలూరు,అమలాపురం వంటి చోట్ల వంద రూపాయలు రేటు పెంచుతున్నారు. అక్కడ అంతకు ముందు 70 రూపాయలు టిక్కెట్ రేటు ఉండేది. ఓ వారం వరకూ ఈ రేటు ని పెంచుకుని అమ్ముకోవచ్చు. అలాగే గుంటూరు, కర్నూలు కూడా ఇవి వర్తిస్తాయి. ఇక ఒంగోలు, నెల్లూరు వంటి టౌన్స్ లలో 120 రూపాయలు పెంచారు. సినిమా ప్రియులను ఈ రేట్లు పెంచటం ఆందోళకు గురి చేస్తోంది. మరో ప్రక్క ప్రీమియర్ షో రేట్లు వెయ్యి నుంచి రెండు వేలు వరకూ పలుకుతున్నాయి.

    కుటుంబ సమేతంగా వీక్షించేలా చక్కటి కథ, కథనాలతో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Mahesh's Srimanthudu :Ticket Rates hiked

    చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.

    కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.

    దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.

    నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.

    శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

    English summary
    In the Andhra towns like Kakinada, Rajahmundry, Eluru and Amalapuram, the ticket price for a single screen theatre is 100/-. AP Government has given nod to increase the ticket rate from 70 to 100 for a week Also this ticket rates will be applied to other towns like Guntur and Kurnool by tomorrow. We hear that some towns like Ongole and Nellore are pricing it at 120 rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X