మహేష్, సమంత కలిసి నిర్మాత కోసం ఒక ‘క్షణం’
హైదరాబాద్: పివిపి సంస్థ ప్రస్తుతం మహేష్ బాబు, సమంత జంటగా బ్రహ్మోత్సవం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఈ సంస్థ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం'. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది.

జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్, సమంతల చేతుల మీదుగా ఫిభ్రవరి 10న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.


Click it and Unblock the Notifications











