»   » మహేష్, త్రివిక్రమ్ చిత్రం ఎంతకి అమ్మాలి?

మహేష్, త్రివిక్రమ్ చిత్రం ఎంతకి అమ్మాలి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రెడీ అవుతున్న చిత్రానికి ఇప్పటికి 32కోట్లు ఖర్చయినట్లు వినిపిస్తోంది. నిర్మాతలు కాస్ట్ కటింగ్ అంటూ మీటింగ్ లు జరుపుతున్న నేపధ్యంలో ఈ పిగర్స్ అంతటా చర్చకు వచ్చాయి. ఇప్పటికి షూటింగ్ జరిగింది 54 రోజులేనని, ఇంకా 150 రోజులు అవసరమవుతాయని అంచనా. ఇక ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం మహేష సినిమాకి కరెక్టు మార్కెట్ 30 కోట్లు మాత్రమే...అంతకు మించి ఖర్చు పెడితే హిట్టయినా లాభాలు రావని అంటున్నారు. ఇప్పటికే ఆ లిమిట్ దాటి 32 కోట్లు అయితే ఇక నిర్మాత శింగనమల రమేష్ దానిని ఎంతకు అమ్మాలని వారు ప్రశ్నిస్తున్నారు.అనూష్క హీరోయిన్ గా రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనీ, హీరో క్యాబ్ డ్రైవర్ అని తెలుస్తోంది.

ప్రస్తుతం సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం పూర్తి భాధ్యతను తీసుకుని దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత శింగనమల రమేష్ బడ్జెట్ అనుకున్న పరిధి దాటిపోవటం, సినిమా రీ షూటింగ్ జరగటం వంటివి గమనించి ఈ నిర్ణయానికి వచ్చి కళ్యాణ్ కి అప్పచెప్పారు. ఇక ఇప్పటివరకూ పనిచేసిన కెమెరా మెన్ సునీల్ పటేల్ ని మార్చి యాష్ భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ, ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. అతిధి తర్వాత చాలా గ్యాప్ తో మహేష్ బాబు ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం ఉంటుంది. సమంతా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu