»   » మహేష్ మురుగదాస్ సినిమా కి బ్రేక్.... ఇప్పుడు త్రివిక్రమ్ తో

మహేష్ మురుగదాస్ సినిమా కి బ్రేక్.... ఇప్పుడు త్రివిక్రమ్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు ఏడాదిగా సాగుతూనే ఉంది. ఈ ఏడాది వేసవిలో విడుదలవుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు మహేష్‌ బ్రేక్‌ ఇచ్చాడట.ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మురుగదాస్ సినిమాకు చిన్న బ్రేక్

మురుగదాస్ సినిమాకు చిన్న బ్రేక్

ఎడతెగని షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ తో మహేష్ బిజీబిజీగా ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఓ షెడ్యూల్ ప్రారంభమైందని కూడా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మహేష్ మాత్రం మురుగదాస్ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ షార్ట్ గ్యాప్ లో త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వచ్చాడు.

మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా

మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా

మురుగదాస్‌ను కాసేపు పక్కనపెట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను లైన్‌లో పెట్టాడట మహేష్‌. సినిమాలతోపాటు యాడ్స్‌కు కూడా మహేష్‌ చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్‌ను ఎండార్స్‌ చేస్తున్న మహేష్‌ తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. లాయిడ్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌ నియమితుడయ్యాడట.

మహేష్-త్రివిక్రమ్ కాంబో

మహేష్-త్రివిక్రమ్ కాంబో

ప్రస్తుతం దీనికి సంబంధించిన యాడ్‌లో మహేష్‌ పాల్గొంటున్నాడట. ఈ యాడ్‌ను త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడట. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో సినిమాల కంటే యాడ్సే ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం టీవీల్లో ఎక్కువగా కనిపిస్తున్న అభి-బస్ యాడ్ కూడా త్రివిక్రమ్ తీసిందే.

మరోసారి

మరోసారి

ఇప్పుడు లాయిడ్ యాడ్ కోసం మహేష్-త్రివిక్రమ్ మరోసారి కలిశారు. ఈ యాడ్‌ షూటింగ్‌ అయిన తర్వాత మహేష్‌.. మురుగదాస్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట. మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

English summary
Mahesh Babu is also is busy with the shooting of the ad commercial participating the ad shoots. Very recently, the actor has signed a brand endorsement deal with Lloyd commercial and popular director Trivikram Srinivas was roped in to direct the ad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu